తెనాలి నుండి బరిలో ఆయనేనా? మాజీమంత్రి ఆలపాటి రాజా సంచలన వ్యాఖ్యలతో పిక్చర్ క్లియర్!!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలు కాగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై, ఇప్పటి నుండే పరుగులు పెడుతున్న నేతలు తాము పోటీ చేసే స్థానాలపై క్లారిటీ తెచ్చుకునే పనిలో పడ్డారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆలపాటి రాజా తెనాలి సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. తెనాలి సీటు తనకేమీ రాసిపెట్టి లేదని మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశానని ఆలపాటి రాజా చెప్పారు. అధికారం తనకు కొత్త కాదని స్పష్టం చేసిన ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాను అని చెప్పుకొచ్చారు.

తనకో సీటు అని రాసిపెట్టి లేదు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఒక సీటు అని తనకు రాసిపెట్టి లేదని, తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు ఏ స్థానంలో పోటీ చేయమంటే అక్కడ తాను పోటీ చేస్తానని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. తన గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదన్న రాజా తాను కూడా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, అంతా చంద్రబాబు చూసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేన పార్టీతో పొత్తు పైన కూడా స్పందించిన ఆయన పొత్తుల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, తన రాజకీయ భవితవ్యం కూడా చంద్రబాబే చూసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెనాలి సీటు టీడీపీకి కాదా?
అంతేకాదు తాను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు పనిచేసిన విధానం అందరికీ తెలుసని పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని ఆలపాటి రాజా చెప్పుకొచ్చారు. కేవలం అధికారం కోసం తాను టీడీపీలో చేరలేదని పేర్కొన్నారు ఆలపాటి రాజా, 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్ట పడుతున్నానన్నారు. ప్రస్తుతం తెనాలి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు వచ్చే ఎన్నికలలో తెనాలి సీటు కచ్చితంగా దక్కే అవకాశం లేదని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ నుండి టీడీపీ పోటీలో ఉండదా అన్న చర్చ జరుగుతుంది.

తెనాలి నుండి పోటీలో ఉండేది ఆయనేనా?
అంతేకాదు ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు నేపథ్యంలోనే ఆయనకు అక్కడి నుంచి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు అనే చర్చ జరుగుతుంది. తెనాలి నియోజకవర్గం నుండి ఆలపాటి రాజా కాకుండా జనసేన పీఏసీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు అన్న చర్చ జరుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా శాసనసభ స్పీకర్ గా కూడా నాదెండ్ల మనోహర్ పని చేశారు.

తెనాలి స్థానం తనకు రాసి లేదన్న వ్యాఖ్యల ఆంతర్యం అదేనా?
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ 2018లో జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున తెనాలి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక స్థానికంగా నాదెండ్ల మనోహర్ కు పట్టుకున్న నేపద్యంలో జనసేన టిడిపి పొత్తు కుదిరితే నాదెండ్ల మనోహర్ కు అక్కడినుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీకి నిలిపే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలోనే తెనాలి స్థానం తనకు రాసి లేదని చేసిన వ్యాఖ్యలు జనసేన టిడిపి పొత్తు కన్ఫామ్ చేస్తున్నాయి. అక్కడి నుండి ఎన్నికల బరిలోకి దిగేది నాదెండ్ల మనోహర్ అన్న సంకేతాలను కూడా ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications