అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సజ్జల' మాట విని వారిద్దరూ ఏమయ్యారో చూడండి?

టీడీపీ అధికారంలోకి వస్తే ఇద్దరు నానీలు దేశం విడిచి వెళతారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ పై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో తమ ఇంటిపైకి సీఐడీ అధికారులు వచ్చారని, చిన్న పిల్లలను కూడా బెదిరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే విచారణకు వచ్చినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈనెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని, వేరే పని ఉండటంతో కోర్టు అనుమతి తీసుకొని ఈరోజు వచ్చినట్లు చెప్పారు. బీసీలపై ప్రభుత్వం కక్షగట్టిందని, సెంటు భూమి కోసం మా ఇంటిపైకి 500 మంది పోలీసులతో దాడిచేశారన్నారు. అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేరన్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకే విజయ్ పై కేసు పెట్టారన్నారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం నిజాయితీగా జీవిస్తోందన్నారు. ప్రభుత్వ అధికారులతో సెంటు భూమి కోసం కేసు పెట్టించారని, తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో ఇదంతా జరుగుతోందని ఉమ మండిపడ్డారు. సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలన్నారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు తమకు కూడా సమయం వస్తుందన్నారు.

ex minister devineni uma and chinthakayala vijay comments on ysrcp government

కొడాలి నాని, పేర్ని నాని అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బూతులు తిడుతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నానీలిద్దరూ హైదరాబాద్ లో దాక్కున్నారని, సారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజల కోసం పోరాడుతోందని, అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి విమర్శించారు. విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ చేయాలని అవినాష్ రెడ్డి చెబుతున్నారని, ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నా

English summary
Devineni Uma commented that if TDP comes to power, the two nannies will leave the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X