మాజీ మంత్రి రోజా అహంకారం.. షాకింగ్ వీడియో వైరల్!!
ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఎప్పుడూ వార్తలలో నిలిచిన రోజా వ్యవహార శైలి ఇప్పుడు మళ్లీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులపై రోజా చిన్నచూపును వ్యక్తం చేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తెలుగుదేశం పార్టీ రోజాపై దుమ్మెత్తి పోస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే
తమిళనాడు ఆలయంలో రోజా... అభిమానులతో సెల్ఫీలు
తమిళనాడులోని తిరెచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం రోజు వరుణాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త అయిన సెల్వమణితో కలిసి హాజరైన మాజీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకున్నారు. రోజా సినీ సెలబ్రిటీ కావడంతో అక్కడ ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆలయంలో రోజాను చూసిన చాలా మంది భక్తులు ఆమెతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇక వారందరినీ నవ్వుతూ పలకరించిన రోజా సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

పారిశుధ్య కార్మికులపై రోజా వివక్ష
అయితే అక్కడే పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు కొందరు రోజాతో కలిసి సెల్ఫీ దిగాలని ఆమె వద్దకు చాలా ఆశతో వచ్చారు. అయితే రోజా దగ్గరకు వస్తున్న పారిశుద్ధ కార్మికులను ఉద్దేశించి దూరంగా జరగమన్నట్టు చేతితో సైగ చేశారు. రోజా సైగలతో దగ్గరికి రాకుండా ఆగిపోయిన పారిశుద్ధ కార్మికులు దూరంగా నిలబడే రోజాతో సెల్ఫీలు దిగారు.
రోజా అహంకారం పై ట్రోల్స్
మిగతా వారందరితో దగ్గరగా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన రోజా పారిశుద్ధ్య కార్మికులను దూరం పెట్టడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అహంకారం పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోజాను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేని ఒక రోజును రోజు ఊహించుకోవాలని సవాల్ విసురుతున్నారు.
పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి. దుమ్మెత్తి పోస్తున్న తమిళ మీడియా. pic.twitter.com/3LmvNlOvT9
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2024
రోజా చేసిన పనికి జగన్ కు తలనొప్పి
పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే మన రోడ్లు, మన ఊర్లు, మన నగరాలు శుభ్రంగా ఉంటున్నాయని, అటువంటి వారిని దూరంగా ఉండాలని రోజా సైగలు చేయడం ఆమెపై విమర్శలకు కారణం కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీకి మరో తలనొప్పిగా మారింది. గతంలో టిడిపి ప్రభుత్వం పైన మాటిమాటికి విరుచుకుపడిన రోజా పైన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు.
రోజాది కనిపించని చెత్త.. టీడీపీ టార్గెట్
పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ అసహ్యంగా హావభావాలు పెట్టి అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి పైన తమిళ మీడియా దుమ్మెత్తిపోస్తుంది అంటూ టిడిపి అధికారిక ఖాతాలో రోజాకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనికి తెలుగు తమ్ముళ్లు ఘాటుగా రోజాపై పోస్టులు పెడుతున్నారు. రోజాది కనిపించని చెత్త.. పారిశుద్ధ్య కార్మికుల కంటే ఆమె చెత్తనే ఎక్కువ అంటూ ఘాటుగా పోస్టల్ పెడుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications