కృష్ణలంక పీఎస్‌లో మల్లాది విష్ణు: సిట్ విచారణకు హాజరు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృష్ణలంకలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారణకు మల్లాది విష్ణు హాజరయ్యారు.
స్వర్ణబార్‌లోని జరిగిన కల్తీ మద్యం కేసులో సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) మల్లాది విష్ణుని విచారిస్తోంది. కల్తీ మద్యం కేసులో ఎఫ్ఐఆర్లో 9వ నిందితుడిగా తన పేరు పోలీసులు చేర్చిన అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన విష్ణు, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసి, బుధవారం (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మల్లాది విష్ణు అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే. మల్లాది విష్ణు సోదరుడి పేరుతో ఉన్న కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్‌తో సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విష్ణుని 9వ నిందితుడిగా చార్జిషీట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.