వైసీపీలోకి...మరో మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు చేరిక

వైసిపిలోకి ఇతర పార్టీ నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో టిడిపి మాజీ ఎమ్మెల్యే జగన్ సమక్షంలో వైసిపిలో చేరాడు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే రంగనాధరాజు వైకాపాలో చేరాడు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధినేత జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, రంగనాథరాజు ఆ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, రంగనాథరాజును జగన్ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, రంగనాథరాజుతో పాటు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

Ex MLA Ranganadha Raju Joined In YSRCP Party

పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధినేత జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజుతో పాటు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీరెడ్డి, జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు.

Ex MLA Ranganadha Raju Joined In YSRCP Party

రంగనాథరాజు ఇటీవలి వరకు జిల్లా టీడీపీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వీరంతా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని తెలిపారు.అనంతరం జగన్ మాట్లాడుతూ చెరుకువాడ రంగనాధరాజు చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+