రిలయన్స్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఫిర్యాదు, సెజ్ వద్దంటూ తిరగబడ్డ రైతులు

అమరావతి: రిలయన్స్ సంస్ధపై అమలాపురం మాజీ ఎంపీ కాకినాడలోని మెరైన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ. 11వేల కోట్ల విలువైన ఓఎన్జీసీ గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ చోరీ చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 నుంచి 2015 వరకు దాదాపు 1112 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ అక్రమంగా తరలించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ex MP GV Harsha Kumar files a case against reliance at Kakinada
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ గ్యాస్ దోపిడీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేదంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. బాధ్యత గల పౌరుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ విషయాన్ని ప్రభుత్వంతో పాటు పోలీసులకు తెలియచేయడం తన బాధ్యత అన్నారు.

పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.

సెజ్ వద్దు, మా భూములు మాకిచ్చేయండి: రైతులు

'సెజ్ మాకు వద్దు, మా భూములు మాకిచ్చేయండి' అంటూ రైతులు తిరగబడిన ఘటన మంగళవారం కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సెజ్ భూములకు సరిహద్దులుగా పాతిన స్తంభాలను రైతులు తొలగించారు.

అనంతరం రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 200 మంది రైతులు ఒకేసారి చొచ్చుకురావడంతో వారిని నిలువరించడం పోలీసులకు సాధ్యపడలేదు.

దీంతో కాకినాడ నుంచి అదనపు బలగాలను పోలీసులు రప్పించారు. సెజ్‌ను రద్దు చేసి, తమ భూములు తమకు అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+