సర్వేతో లగడపాటి రాజగోపాల్ రంగ ప్రవేశం?
ల్యాంకో గ్రూప్ నేతల్లో ఒకరు, సీనియర్ రాజకీయవేత్త అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీచేయబోతున్నారనేది ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న కేశినేని నానికి అధిష్టానంతో దూరం పెరిగింది. సొంత పార్టీలోనే అసమ్మతి నేతగా మారిన కేశినేని నానికి బదులుగా లగడపాటిని దించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ నుంచి రెండుసార్లు గెలిచిన లగడపాటి
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు లగడపాటి విజయవాడ నుంచి విజయం సాధించారు. ప్రధానంగా రాజకీయంగా పార్టీలకు సంబంధించి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమిపాలవుతారు? అనే విషయంలో ఆయన చేయించే సర్వేలు 100కు 100 శాతం కచ్చితత్వంతో ఉండేవి. దీంతో ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు వచ్చింది. 2018 తర్వాత మాత్రం ఆయన సర్వేలు నిజం కాలేదు. దీంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు దూరం జరిగారు. మళ్లీ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఏపీ రాజకీయాల్లో లగడపాటి పేరు వినిపిస్తోంది.

ఉద్యమ సమయంలో లగడపాటి హడావిడి
తెలంగాణ ఉద్యమ సమయంలో లగడపాటి చేసిన హడావిడిని ఎవరూ మరిచిపోలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన పెప్పర్ స్ప్రే ఘటనను కూడా ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. రాజకీయాలకు దూరం జరిగినప్పటికీ 2014 ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెప్పిన విషయం నిజమైంది. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తాయని ఆయన చెప్పిన అంచనా తప్పైంది. అదే లగడపాటికి సర్వేల పరంగా తొలి పరాజయం. తర్వాత 2019 ఎన్నికల్లో ఏపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది కూడా విఫలమైంది. వైసీపీ గెలవడంతో సర్వేలే చేయనని చెప్పారు.

అంతర్గత సర్వే
అయితే లగడపాటి రాజగోపాల్ అంతర్గతంగా సర్వే నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేస్తే విజయావకాశాలుంటాయని ఆయన సర్వేలో తేలడంతో పోటీకి మొగ్గుచూపుతున్నారు. కేశినేని నాని రెండు పర్యాయాలు అధినేత చంద్రబాబు పట్ల అనుసరించిన వైఖరి, ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు టీడీపీలోనే చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపుగా టీడీపీ నుంచి లగడపాటి పోటీచేయడం ఖాయమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పారు..కానీ వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ దెబ్బతో సర్వేలే చేయనని చెప్పేశారు. కాకపోతే సీక్రెట్ గా ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీలోకి రావాలని చూస్తున్నారని టాక్ వస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి
-
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications