Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!
ఏపీలో పలుమార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (Kavuri Sambasiva Rao) ఇవాళ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చనిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు ప్రతీ మీడియా ఛానల్ కూడా కావూరి సాంబశివరావు ఇక లేరనే బ్రేకింగ్ న్యూస్ కు కూడా ఇచ్చేసింది. వీటిపై కుటుంబ సభ్యులు స్పందించారు.
కావూరి సాంబశివరావు చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అధికారికంగా తాము చెప్తే తప్ప ఇలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. దీంతో కావూరి సాంబశివరావు చనిపోయారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. అయితే ఇప్పటికీ కావూరి పరిస్ధితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కావూరి సాంబశివరావుకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఇప్పటివరకూ ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన కావూరి.. 2013లో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. కావూరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం, బ్యాంకుల అప్పుల వ్యవహారాల్లో చిక్కుకోవడం, ఆ తర్వాత బీజేపీలో చేరిపోవడం జరిగాయి. అయితే ఆయన అనారోగ్యం కారణంగా కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications