అటెండర్ ఫొటో తీస్తే లీకేజీ అంటారా?: గంటా ఫైర్, చంద్రబాబు వార్నింగ్

Subscribe to Oneindia Telugu

అమరావతి: పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష జరగడానికి ముందే జరిగితే దాన్ని లీకేజీ అంటారని అన్నారు.

మంత్రి గంటా లీకేజీ అంశంపై ఢిల్లీలో మాట్లాడుతూ.. ఓ అటెండర్.. పరీక్షలు జరుగుతుండగా ఫొటోలు తీసి షేర్ చేశాడని తెలిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఏపీని విద్యకు మోడల్ స్టేట్‌గా తీర్చుదిద్దుతున్నామని చెప్పారు.

exam papers not leaked, says Ganta

లీకేజీ, ఆత్మహత్యల్లో 'నారాయణే' నెం.1, గంటా ఏం చేస్తున్నారు: రోజా నిప్పులు

ఉపేక్షించొద్దు: చంద్రబాబు వార్నింగ్

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ నేతలు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. నేరానికి పాల్పడినవారు ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని ఆదేశించారు.

సభలో వైసీపీ ఆందోళన: జగన్ పార్టీది అరాచకమంటూ గోరంట్ల ఆగ్రహం

ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, లీకేజీపై చర్చించాలంటూ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన కొనసాగిస్తుండటంతో వాయిదాలు పడుతూ సాగుతోంది సభ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh miniser Ganta srinivasa Rao on Tuesday said that 10th class exam papers had not leaked.
Please Wait while comments are loading...