ఆ టీం పైనే చంద్రబాబు ఆశలు - సక్సెస్ దక్కేనా..!!
సీఎం చంద్రబాబు పోలవరం..అమరావతి పై ఫోకస్ చేసారు. ఈ రెండు తన ప్రాధాన్యతాంశాలుగా వెల్లడించారు. పోలవరం సందర్శించిన చంద్రబాబు...ప్రాజెక్టు పై శ్వేతపత్రం విడుదల చేసారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల అధ్యయనం కోసం అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం చేరుకుంది. ఈ బృందం పరిశీలన చేసే ఇచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పైన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది.
పోలవరం పరిశీలన
పోలవరం ప్రాజెక్టు వద్దకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. ఈ బందంలో అమెరికాకు చెందిన డేవిడ్, జియన్ ప్రకోడికికో కెనడాకు చెందిన రిచర్డ్ డేనీ యూల్, సీమ్ హించ్ బర్గర్ ఉన్నారు.. తొలి రోజు కాఫర్ డ్యాంతో పాటు ఇతర పనుల తీరును పరిశీలిస్తారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వరదలకు దెబ్బ తిన్న రిటర్నింగ్ వాల్‌తోపాటు, కాఫర్ డ్యాం, గైండ్ బండ్‌ను పరిశీలించారు.

నివేదిక కీలకం
పోలవరం ప్రాజెక్టు పరిశీలిచించిన చంద్రబాబు వైసిపి ప్రభుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్ట్ పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు. బృందం పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లలో ప్రభుత్వం నిర్ణయించనుంది. ఈ బృందం వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణులు బృందం నివేదిక ఇవ్వబోతుంది.

ప్రాజెక్టు భవితవ్యం
ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇక అప్పర్ కాపర్ డ్యామ్‌లో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్‌గా ఉండబోతోంది. మెయిన్ డ్యామ్‌లో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మత్తులు చేయాలా..లేక, మళ్లీ కొత్తగా నిర్మించాలా..అనేది నిపుణులు తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ టీం నివేదిక చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణం వేసే అడుగులకు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications