బైక్‌పై బాణాసంచా తీసుకెళ్తుండగా పేలుడు: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

దీపావళి పండగవేళ ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం గుంతలో పడటంతో బండి అదుపుతప్పింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరులోని తూర్పు వీధిలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కిందపడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది.

Explosion while carrying firecrackers on bike One dead six injured

ఈ ఘటనలో సుధాకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఓ పిడుగు బాణాసంచా తయారీ కేంద్రం పడింది. దీంతో మందుగుండు సామగ్రి క్షణాల్లో బూడిదైంది. మంటలు భారీగా చెలరేగడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు మహిళలు సజీవదహనమైపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 9 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో చోటుచేసుకుంది.

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తోన్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు ఊపిరాడక అందులోని మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+