తమ్ముడితో వివాహేతర బంధం: ప్రియుడితో కలిసి కట్టున్న భర్త దారుణ హత్య
తూర్పుగోదావరి: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా పెరుగుతున్న హత్యలు ఆందోళనకర పరిస్థితులకు దారిస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలి కోసం భర్తలు భార్యలను, భార్యలు భర్తలను చంపడం లాంటి ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి.
తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోని రమణయ్యపేటలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ఏకంగా కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కినెట్టారు.

తమ్ముడితో నాలుగేళ్లుగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఐశ్వర్యకాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, హిమచందు దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. కాగా, హిమచందు.. తన తండ్రి రెండో భార్య కొడుకు అంటే సొంత తమ్ముడు భాను ప్రసాద్‌తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది.

భర్త మందలించినా..
అయితే, ఈ విషయం హరిప్రసాద్‌కు తెలిసి.. పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు భార్యను మందలించాడు. హిమచందు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న హరిప్రసాద్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు హిమచందు, భాను ప్రసాద్.

భర్త హత్య.. తగలబెట్టేశారు
ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చిన హరిప్రసాద్‌ను హిమచందు, భాను ప్రసాద్‌లు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి భానుప్రసాద్.. హరిప్రసాద్ మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి.. రమణయ్యపేటలో కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డు దగ్గరపడేశాడు. మృతదేహంపై టైర్లు, చెత్తవేసి తగలబెట్టారు.

ఏమీ ఎరగనట్లుగా..
కాగా, శనివారం ఉదయం హరిప్రసాద్ కోసం తండ్రి ఇంటికి వెళ్లగా.. హిమచందు ఏమీ ఎరగనట్లుగా బయటికి వెళ్లారని చెప్పింది. హరిప్రసాద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని తమ్ముడు రాయుడు శ్రీను సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

నిందితుల అరెస్ట్
సగం కాలిపోయిన మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహం హరిప్రసాద్‌దిగా గుర్తించారు. అనంతరం హరిప్రసాద్ భార్య హిమచందు, భానుప్రసాద్‌ను, అతని తల్లిని, ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. నిందితులు నేరం అంగీకరించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications