అక్రమ సంబంధమే కారణం?: నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న మహిళ విధులు ముగించుకొని బయటకువస్తున్న సమయంలో ఓ వ్యక్తి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన చిలకలూరిపేటలోని సుగాలి కాలనీలోని కళ్యాణి రెస్టారెంట్ ఎదుట జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సుగాలి కాలనీకి చెందిన రమావత్ జైనీబాయి(25)కి అదే కాలనీకి చెందిన బాలునాయక్(29)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోవడంతో.. కళ్యాణి రెస్టారెంట్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో అదే రెస్టారెంట్లో పని చేస్తున్న ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండేది. కాగా, జైనీబాయితో సహజీవనం చేస్తున్న సదరు వ్యక్తి నెల రోజుల కిందట ఆటో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమె మంగళవారం రెస్టారెంట్లో విధులు ముగించుకొని బయటకు వస్తుండగా.. ఆటో ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సోదరుడు కత్తితో దాడి చేశాడు.

Extramarital affair: A woman murdered in Guntur

పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. కాగా, హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తన సోదరుడి మృతికి ఆ మహిళే కారణమని నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తన సోదరుడిని ఆ మహిళ చంపించిందని నిందితుడు ఆరోపించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+