నెల్లూరులో ఫడ్నవీస్: స్వర్ణభారతికి ఫ్యాన్స్, పవన్‌కి వెంకయ్య థ్యాంక్స్
నెల్లూరు: తెలుగు ప్రజలకు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం నాడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్‌లో వెంకయ్య నాయుడు నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ఫడ్నవీస్, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడారు. యువకులు, నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తమ అందరికీ కేంద్రమంత్రి వెంక్యయ నాయుడు మార్గదర్శకులన్నారు. స్వర్ణభారత్ ట్రస్టును నిజంగా స్వర్ణంగా తీర్చిదిద్దారన్నారు.

కాగా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్, దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హరిబాబు పాల్గొన్నారు.
వీరితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పవన్ అభిమానులు తరలి వచ్చారు. తన ఆహ్వానం మన్నించి వచ్చిన పవన్ కళ్యాణ్, దేవేంద్ర ఫడ్నవీస్‌లకు వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications