ఎపి చరిత్రలో చెత్త: కిరణ్‌పై హరీష్, విద్యార్థుల వల్లే: డిఎస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది చెత్త పాలన అని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం మండిపడ్డారు. భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రెండు కళ్లు అన్నారు. గోదావరి జలాల కోసమే భద్రాచలం పైన సీమాంధ్ర నాయకుల కన్ను పడిందని ఆరోపించారు.

విద్యార్థుల త్యాగ ఫలితమే: డిఎస్
తెలంగాణ విద్యార్థుల త్యాగ ఫలితం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయిందని శాసన మండలి సభ్యులు, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ వేరుగా అన్నారు. రెండు రాష్ట్రాలలోనే వచ్చే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కొందరు పాలకుల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణ ఆలస్యమయిందని చెప్పారు.
రాయల తెలంగాణ దారుణం: ఆర్ దామోదర్ రెడ్డి
సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత రాయల తెలంగాణపై వివరాలు తీసుకోవడం దారుణం అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు పది జిల్లాల తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, దీనిపై తెలంగాణ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సోనియాతో జైపాల్ భేటీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణ అంశానికి సంబంధించి బిల్లు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications