Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోరంట్లకు పెద్ద చిక్కు.. 5రూపాయల చిల్లర గాళ్ళ ఫేక్ పోస్టులు అంటూ చిందులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉన్న వీడియో గురువారం కలకలం రేపింది. సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడడాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్లో చిత్రీకరించినట్లుగా ఆ వీడియో ను బట్టి అర్థమవుతుంది. అయితే అది తాను జిమ్లో వర్కవుట్ చేస్తున్న సమయంలో చేసిన వీడియోను మార్ఫింగ్ చేశారని, అది నకిలీదని గోరంట్ల మాధవ్ మండిపడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కుట్ర అంటూ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరుగుతున్నారు.

గోరంట్ల నగ్న వీడియో కలకలం.. గోరంట్ల బుచ్చయ్యకు తలనొప్పి

గోరంట్ల నగ్న వీడియో కలకలం.. గోరంట్ల బుచ్చయ్యకు తలనొప్పి

అయితే గోరంట్ల నగ్న వీడియో కలకలం రేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. గోరంట్ల అశ్లీల వీడియో వైరల్ అవుతున్నట్లుగా మొదట పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇక దీనిపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ వైరల్ అవుతున్న అశ్లీల వీడియో నాది కాదని, దయచేసి మీడియా మిత్రులు పేరు పూర్తిగా వెయ్యాలని, గోరంట్ల అనగానే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లుగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 గురువింద గింజ సామెత లాగా ఉంది ఇది: మండిపడిన గోరంట్ల

గురువింద గింజ సామెత లాగా ఉంది ఇది: మండిపడిన గోరంట్ల


ఆ వీడియోకు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎటువంటి సంబంధం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదేదో తన వ్యవహారంలో ఆందోళన చెందినట్టు సోషల్ మీడియాలో వెలసిన పోస్టుపై ఆయన మండిపడుతున్నారు. అది ఫేక్ పోస్ట్ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తేల్చి చెబుతున్నారు. జనాల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం వైసిపి చేసిన పనిగా ఆయన అభివర్ణిస్తున్నారు. గురువింద గింజ సామెత లాగా ఉంది ఇది అంటూ పేర్కొన్న ఆయన ఫేక్ పోస్ట్ లు వేయడం, దొరికిపోవడం అలవాటుగా మారింది అంటూ మండిపడ్డారు.

మా మీద ఫేక్ పోస్టులు పెట్టించే శ్రద్ద మీ పార్టీలో కామాంధుల మీద పెట్టండి

మా మీద ఫేక్ పోస్టులు పెట్టించే శ్రద్ద మీ పార్టీలో కామాంధుల మీద పెట్టండి


వెయ్యని పోస్టు వేసినట్టు చూపించడం, నిజాలు కనపడినా వీడియో మార్ఫింగ్ అని చెప్పి కప్పడం ఒక్క 5 రూపాయల చిల్లర గాళ్ళకే చెల్లుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మా మీద ఫేక్ పోస్టులు పెట్టించే శ్రద్దలో సగం వైసీపీ కామాంధుల మీద పెడితే రాష్ట్రంలో ఆడవాళ్లు బ్రతుకుతారు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసిపి సర్కార్ కు చురకలంటించారు.

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై టీడీపీ ఫైర్

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై టీడీపీ ఫైర్


ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోల వ్యవహారంపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనూరాధాలు నిన్నటికి నిన్న గోరంట్ల మాధవ్ వ్యవహారం పై నిప్పులు చెరిగారు. హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ విషయంలో నాన్చి నాన్చి సస్పెండ్ చేస్తున్నాం అని చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు వంగలపూడి అనిత.

Recommended Video

    సర్వే చేసినం... 65స్థానాలు మావే *politics | Telugu OneIndia
     ఎంపీని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్

    ఎంపీని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్

    ఇప్పుడు అసభ్య వీడియో లో అడ్డంగా దొరికిన ఎంపీ పై ఇంకా ఏ చర్యా లేదు. తక్షణమే అతడితో మహిళలకు క్షమాపణ చెప్పించి అతణ్ణి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము అంటూ వెల్లడించారు. అక్క చెల్లెమ్మలు, అంటూ తెచ్చిపెట్టుకున్న ప్రేమలు ఒలకబోయడం కాదు. ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవడానికి మీన మేషాలు లెక్కబెట్టకుండా వెంటనే వేటు వెయ్యాలి అని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఇంకా కాలయాపన చేయడం సిగ్గు చేటు అంటూ వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+