కడపలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మైలవరం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వహీద్ కుటుంబంగా గుర్తించిన పోలీసులుమూడు మృతదేహల వెలికితీత, ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు
కడప: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. జిల్లాలోని మైలవరం జలాశయంలోకి ఐదుగురు వ్యక్తులు దూకేశారని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సాయంతో పోలీసులు ఇప్పటికి ముగ్గురిని వెలికి తీశారు. అయితే, ఆ ముగ్గురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు. షమీమ్ (40), ఆషా (29), మహబూబీ (19) గా పోలీసులు గుర్తించారు.

జలాశయంలోకి దూకిన మరో ఇద్దరు వాహిద్ (42), షబానా (17) కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితులంతా జమ్మలమడుగు మండలం రాజీవ్‌నగర్ కాలనీ వాసులని తెలిపారు.
జమ్మలమడుగు రాజీవ్ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ వహీద్ ఏడాదిగా ఖాళీగా ఉంటున్నారు. దీంతో జీవనం కష్టంగా మారింది. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పెరిగిపోయాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications