రుషికొండ భవనాల వినియోగం పై భారీ ట్విస్ట్..!!
రుషికొండ భవనాల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ హయాంలో నిర్మించిన ఈ నిర్మాణాల వినియోగం పైన కూటమి ప్రభుత్వం చర్చలు చేస్తోంది. ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలో అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇప్పటికే పలువురతో సమావేశాలు నిర్వహించింది . పలు ప్రముఖ హోటళ్లు.. ఆతిథ్య రంగంలో పేరున్న సంస్థలు తమ అభిప్రాయా లను వెల్లడించాయి. కాగా.. తాజాగా వీటి వినియోగం పైన కొత్త ప్రతిపాదనలు ఆసక్తి కరంగా మారాయి.
రుషికొండ భవనాల వినియోగం పైన ప్రముఖ సంస్థలు కీలక ప్రతిపాదనలు చేసాయి. పర్యాటక ప్రాంతంగా, అద్భుత ఆతిథ్య కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతంగా, విలాసవంతమైన బీచ్ విల్లాలుగా చక్కని మ్యూజియంతో అలరారేలా తిరిగి తీర్చిదిద్దేందుకు ప్రముఖ హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. తమకు అవకాశం కల్పిస్తే ఆ ప్రతిపాదనలకు చక్కటి రూపకల్పన చేస్తామని పేర్కొన్నాయి. టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఐహెచ్‌సీఎల్ గ్రూపు, ఎట్మాస్పియర్ కోర్ హాస్పిటాలిటీ గ్రూపు, ద లీలా (ప్యాలెస్‌లు, హోటళ్లు, రిసార్టుల గ్రూపు), హెచ్‌ఈఐ (హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూపు) వాటి సామర్థ్యాలను వివరిస్తూ ప్రతిపాదనలు సమర్పించాయి.

ఐహెచ్‌సీఎల్ - టాటా ఎంటర్ప్రైజెస్ ఈతకొలనుల సహా విల్లాలు, స్పా, యోగా సెంటర్లుగా సూచనలు చేసింది. మాడ్యులర్ సమావేశ మందిరం, భోజన హాళ్లు కోసం కన్వెన్షన్ బ్లాక్ (కళింగ) ఏర్పాటు చేయనున్నారు. సమావేశాల నిర్వహణ, ఇతర ప్రజా అవసరాలకు వీలుగా క్లబ్ హౌస్ నిర్మించనున్నారు. దీనిలో స్పా, యోగా డెక్, జిమ్, మినీ థియేటర్, ఎఫ్‌అండ్‌బీ ఔట్‌లెట్లు నిర్మాణాలు. బ్లాక్-1 లో ఆర్ట్ గ్యాలరీలు, హస్తకళల మార్కెట్, క్రాఫ్ట్ స్టూడియోలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు బహుళ ప్రయోజన హాళ్లు ప్రతిపాదించారు. అదే విధంగ బ్లాక్-2 లో చరిత్రకు సంబంధించిన ఆర్కైవ్‌లు, నేచురల్ హిస్టరీ గ్యాలరీలు, రొటేటింగ్ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అనువుగా మలచడంపైన ప్రతిపాదనలు చేసారు.
అదే విధంగా సూర్యవనం, చంద్రవనం, తారావనం వంటి గార్డెన్లు, ఎదురుగా ఉన్న తీరాన్ని చూస్తుండే విధంగా ఒలింపిక్ సైజు ఇన్ఫినిటీ పూల్ ఏర్పాటు చేయడం పైన సూచనలు చేసారు. ఇక.. తొమ్మిది ఎకరాల స్థలంలో 200-250 స్టాండర్డ్, డీలక్స్ గదులు, సహా విల్లాలు, ఈత కొలనులు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. లాబీ, ఎఫ్‌అండ్‌బీ ఔట్‌లెట్లు, స్పా, ఫిట్‌నెస్, స్విమ్మింగ్ పూల్, భోజన మందిరాలు ఏర్పాటు పైన ప్రతిపాద చేసారు.సీఆర్‌జడ్ నిబంధనలకు వర్తించే స్థలాలు అనుమతులు ప్రభుత్వం ఇవ్వటంతో పాటుగ నేరుగా బీచ్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. చుట్టూ ప్రభుత్వ స్థలం సుందరీకరణ, రిక్రియేషన్ ఇతర కార్యకలాపాల నిర్వహణకు వెసులుబాటు ఇవ్వాలని కోరాయి. మొత్తం 1,517 ప్రతిపాదనలు అందాయి. దీంతో.. త్వరలోనే రుషికొండ భవనం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications