ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy)(84) తుదిశ్వాస విడిచారు. ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో 7 నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఈ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే శనివారం కన్నుమూశారు.

కాగా, 1940లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లెలో జన్మించారు యామినీ కృష్ణమూర్తి. యామినీ తన కెరీర్‌​లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

Famous Indian Dancer Yamini Krishnamurthy passed away

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆస్థాన నర్తకిగానూ యామినీ సేవలు అందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ ట్రైనింగ్ సెంటర్​ను స్థాపించి డ్యాన్స్‌​లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌ పేరుతో పుస్తకం కూడా రచించారు. యామినీ కృష్ణ మరణంతో ఆమె కటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు కళాకారులు,ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సంతాపం

యామినీ కృష్ణమూర్తి మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తే. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యామినీ కృష్ణమూర్తి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన యామిని కృష్ణమూర్తి మరణం గురించి విని నేను చాలా బాధపడ్డాను. ఈ కష్ట సమయాల్లో నా ఆలోచనలు, ప్రార్థనలు ఆమె కుటుంబంతో ఉన్నాయి అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+