Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి కన్నుమూత

Recommended Video

    రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం

    విజయవాడ: ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియాలోని గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ధృవీకరించారని సమాచారం. అయితే ఆమె మృతికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

    తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.

    Famous writer yaddanapudi sulochana rani passed away

    1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యద్దనపూడి సులోచనరాణి జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. . తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు.

    భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.

    యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+