అక్కినినే కన్నుమూత: గుండెపోటుతో అభిమాని మృతి
మెదక్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు మృతిని తట్టుకోలేని ఓ వీరాభిమాని గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. మెదక్ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మయూరీ నగర్‌లో నివాసం ఉంటున్న కె.రాంబాబు (55) అనే అక్కినేని వీరాభిమాని గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందాడన్న విషయాన్ని టీవీలో చూస్తూ ఉదయం 11 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు రాంబాబును స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన మామ అక్కినేనికి వీరాభిమాని అని, అక్కినేని మరణవార్త టీవీల్లో చూసి తట్టుకోలేక మరణించారని రాంబాబు అల్లుడు భాస్కర్ మీడియాతో చెప్పారు.
అక్కినేని నాగేశ్వర రావును ఓ తరం యువత విపరీతంగా అభిమానించారు. దసరా బుల్లోడు, పూలరంగడు వంటి సినిమాలు అప్పట్లో అప్పటి యువతను ఉర్రూతలూగించాయి. గుండెపోటుతో మరణించిన రాంబాబు కూడా ఆ తరానికి చెందినవారే.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం













Click it and Unblock the Notifications