సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : టికెట్ ధరలు ఇలా- రిజర్వేషన్ ప్రారంభం..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ - తిరుపతి- సికింద్రాబాద్ వందే భారత్ ను ప్రధాని మోదీ ఈ నెల 8న సికింద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రయాణం కు సంబంధించి ఇప్పటికే అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు టికెట్ ధరలను అధికారులు వెల్లడించారు. రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఒక వందేభారత్ కొనసాగుతుండగా..మూడు నెలల కాలంలోనే రెండో వందేభారత్ ప్రారంభిస్తున్నారు.

16 కోచ్ లతో వందేభారత్ : ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ వందేభారత్ ను ప్రారంభిస్తారు. తొలి రోజు 13 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తొలి రోజు మాత్రం ప్రత్యేక సమయాల్లో ఈ రైలును నడపనున్నారు. ప్రజా ప్రతినిధు లు , విద్యార్దులు ఈ రైలుకు ప్రతీ స్టేషన్ లో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసారు. 9వ తేదీ తిరుపతి నుంచి మధ్నాహ్నం 3.15 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్ చేరుతుంది. 10వ తేదీ నుంచి ఉదయం సికింద్రా బాద్ లో బయల్దేరి తిరుపతి చేరుకుటుంది. తిరిగి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రికి సికింద్రాబాద్ చేరుకొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. మొత్తం 16 కోచ్ లతో ఈ రైలు సిద్దం అయింది. 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ తిరుపతి చేరుకోనుంది.

Vande Bharat

టికెట్ ధరలు ఖరారు..: తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ రిజర్వేషన్ ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 20701 ద్వారా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, అదే విధంగా 20702 నెంబర్ ద్వారా తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ టికెట్ ధర రూ 1,680 గా నిర్ధారించారు. అందులో కేటరింగ్ ఫీజు రూ 364 గా ఉంది. వద్దనకుంటే ఆ ఛార్జీ మినహాయిస్తారు. అదే విధంగా ఈ రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ 3,080 గా నిర్ణయించారు. అదే విధంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ఛైర్ కార్ ధర రూ 1,625గా ఉంది. అదే రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 3,030 గా ఖరారు చేసారు. ఇప్పటికే రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది.

Vande Bharat

నాలుగు స్టేషన్లలో హాల్ట్..: సికింద్రాబాద్ - తిరుపతి-తిరుపతి మధ్య వందేభారత్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్ కు రాత్రి 23.45కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లకు మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+