పదవికే నేను అలంకారప్రాయం....వీడ్కోలు సభలో డిజిపి నండూరి భావోద్వేగం...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ: డిసెంబర్ 31 న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నండూరి సాంబశివరావు పదవీ విరమణ పురస్కరించుకొని ఎపి పోలీసు శాఖ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన పరేడ్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సహా నూతన డీజీపీ మాలకొండయ్య హాజరయ్యారు. ఈ పెరేడ్‌లో సాంబశివరావు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగం సమయంలో నండూరి సాంబశివరావు భావోద్వేగానికి లోనయ్యారు.

పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 33 ఏళ్ల సర్వీసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే పెద్దలు తప్పుచేస్తే చెల్లుతుంది,చిన్నలు తప్పు చేస్తే చెల్లదని అన్నారు. మొట్టమొదటి సారిగా బెల్లంకొండ లో ఏ. యస్.పి. గా విధుల్లో చేరాను.
ఉమేష్ చంద్ర,వ్యాస్ త్యాగాలు పోలీసులు ఎప్పటికి మరువలేరు,

తీవ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న కాలంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టారని చెప్పారు.రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు.దేశస్థాయిలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడంలో ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

 గురువులకు పాదాభివందనం...

గురువులకు పాదాభివందనం...

నాకు చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలు సమర్పిస్తున్నా...నేను ఈ స్థాయికి రావడానికి నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బాలకృష్ణ మూర్తి, రామకృష్ణ రావు ల కృషి ఉంది.నేను స్కూల్ విద్యను అభ్యసించే సమయంలో నా గురువు రామకృష్ణ ప్రోద్బలంతో నాలో ఉన్న సామర్థ్యం గుర్తించాను. 7 వ తరగతి లో మనా టీచర్ రామకృష్ణ రావు చెప్పిన ప పాఠం నాకు యుపిఎస్సి పరీక్ష లో ప్రశ్న గా వచ్చింది.నా కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారు.

 పదవికే నేను అలంకారం...

పదవికే నేను అలంకారం...

నా కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారు...నాకు పదవి అలంకారప్రాయం కాదు, పదవికే నేను అలంకారప్రాయం...ఆర్టీసి ఎండి గా ఉన్నప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాను...నా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకం ఉంచి కట్టబెట్టిన ప్రతి బాధ్యతను సంపూర్తిగా నిర్వర్తించాను...నా విధినిర్వహణలో ఎవ్వరినీ ఎప్పుడు ఇబ్బందులకు గురిచేయలేదు...మాటలతోనే ఇబ్బంది పెట్టాను తప్ప రాతలతో ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.

 నూతన డిజిపి మాలకొండయ్య...

నూతన డిజిపి మాలకొండయ్య...

డిజిపి వీడ్కోలు సభలో ఎపి నూతన డిజిపి మాలకొండయ్య మాట్లాడుతూ నండూరి సాంబశివరావు ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన తనకు అన్నలాంటి వారని చెప్పారు. వృత్తిపరంగా ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు.

ఆయురారోగ్యాలతో...సంపూర్ణ జీవితం...

ఆయురారోగ్యాలతో...సంపూర్ణ జీవితం...

నండూరి సాంబశివరావు గారి నుంచి నేను అయిదుసార్లు బాధ్యతలు తీసుకున్నా...మేము ఇద్దరం కాకినాడ ఒకే ఎస్పీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం...నండూరి సాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తి తో పని చేస్తాం..రిటైర్మెంట్ తరువాత సాంబశివరావు గారు విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా గడపాలని దేవుడిని కోరుకుంటున్నానని నూతన డిజిపి మాలకొండయ్య ఆకాంక్షించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Farewell ceremony of AP DGP Nanduri Sambasivarao was organised in 6th battalion mangalagiri on sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి