సమ్మెపై జగన్, బాబు సభలో ఆత్మహత్యాయత్నం
విజయనగరం/కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ మద్ధతు ఇస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వాలు... ఆర్టీసీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్మెంట్ కోరడం సరైనదే అన్నారు.

చంద్రబాబు సభలో పురుగుల మందు తాగిన రైతు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం నాడు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంలో జరిగింది.
చంద్రబాబు జిల్లాలోని నర్సీపురం గ్రామంలో నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పురుగుల మందుతో వచ్చిన చిన్నభోగిలి గ్రామ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications