వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతమనేని చేసిన పనికి షాకిచ్చిన రైతులు .. ఏకంగా పైపుల చోరీ కేసు పెట్టి పరువు తీసారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

చింతమనేని పై చోరీకేసుపెట్టి పరువు తీసిన రైతులు || Oneindia

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాటగా సాగిందని ఇక ఇప్పుడు కూడా సాగాలి అంటే సాగుతుందా? సాగదు అనే విషయం వివాదాస్పదంగా వ్యవహరించటం అలవాటైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అర్థమైనట్టుగా లేదు. ఇక ఆ విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పారు దెందులూరు నియోజకవర్గ రైతులు.

కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. సాయంత్రం కీలక ప్రకటన ?కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. సాయంత్రం కీలక ప్రకటన ?

చింతమనేని పనికి అవాక్కైన రైతులు .. రివర్స్ షాక్

చింతమనేని పనికి అవాక్కైన రైతులు .. రివర్స్ షాక్

చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో పై దాడికి పాల్పడి వార్తలకెక్కిన వ్యక్తి. ఎవరేమి చెప్పినా, ఏకంగా చంద్రబాబు చెప్పినా ఐ డోంట్ కేర్ అంటూ రాజకీయాలు నెరపిన మాజీ ఎమ్మెల్యే తా జాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తాజాగా ఆయన నియోజకవర్గంలో చేసిన పని చూసి రైతులు అవాక్కయ్యారు. మరి ఇంత కక్కుర్తి అవసరమా అంటూ మండిపడ్డారు. ఇక అంతేనా ఏకంగా చింతమనేని పైన, ఆయన అనుచరులపైనా కేసు పెట్టారు.

చిన్తమనేనిపై పైపుల దొంగతనం కేసు పెట్టిన రైతులు ..

చిన్తమనేనిపై పైపుల దొంగతనం కేసు పెట్టిన రైతులు ..

ఇంతకీ చింతమనేని ఏం చేశాడు ? రైతులు ఆయన పైన పెట్టిన కేసు ఏంటి అంటే దెందులూరు రైతులు పైపులు దొంగతనం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేశారు. చింతమనేని దొంగతనం చేయడం ఏమిటి అంటే దానికో పెద్ద కథే ఉంది. అది పోలవరం తో ముడిపడి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళుతున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయటానికి అనువుగా మూడేళ్ల క్రితం చింతమనేని ప్రభాకర్ అధ్వర్యంలో పైపులు ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. ఇక ఈ పైపుల ద్వారా దెందులూరు తో పాటు సమీప మండలాలైన పెదవేగి,పెదపాడు, ఏలూరు రూరల్ మండల్లాల్లోని గ్రామాల్లో సాగునీరు అందుతుంది. ఇదిలా ఉంటే.. నీటిని పెట్టుకునేందుకు వాడిన పైపులకు అద్దె అంటూ ప్రతి ఏడాది వెయ్యి చొప్పున రైతుల నుంచి చింతమనేని వసూలు చేస్తున్నారు.

చింతమనేని పెట్టించారని పంటపొలాల పైప్ లైన్లు తీసివేత .. ఏటా ఎకరానికి వెయ్యి ఇచ్చామని రైతుల ఆందోళన

చింతమనేని పెట్టించారని పంటపొలాల పైప్ లైన్లు తీసివేత .. ఏటా ఎకరానికి వెయ్యి ఇచ్చామని రైతుల ఆందోళన

ఇక ఇప్పుడు చింతమనేని ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో చింతమనేని అనుచరులు వెళ్లి చింతమనేని తీసుకురమ్మన్నారంటూ పైపుల్ని తీసేశారు. ఇక ఈ చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళన నిర్వహించారు. పైపుల్ని మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటా ఎకరానికి వెయ్యి రూపాయిలు ఇచ్చామని పేర్కొన్నారు. తాము ఇచ్చిన డబ్బుల ద్వారా పైపుల మీద వారు పెట్టిన ఖర్చుకు మించిన డబ్బులు సమకూరాయని తెలిపారు. అయినా వేధింపులకు గురి చేయటాన్ని వారు తప్ప పడుతున్నారు.దీంతో చింతమనేనితో సహామరో ఐదుగురిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అనవసరంగా పరువు పోగొట్టుకున్న చింతమనేని ప్రభాకర్ .. పవర్ లో లేరని మరచిపోతే ఎలా ?

అనవసరంగా పరువు పోగొట్టుకున్న చింతమనేని ప్రభాకర్ .. పవర్ లో లేరని మరచిపోతే ఎలా ?

అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టే అధికారం లేనప్పుడు ప్రవర్తిస్తే , ఈ చిన్న విషయానికి కక్కుర్తి పడితే ఇప్పుడు రైతులు పైప్ ల దొంగతనం కేసుపెట్టారు. ఏటా ఎకరానికి వెయ్యి వసూలు చేశారన్న విషయం బయటపెట్టారు. తన చర్యతో చింతమనేని అనవసరంగా పరువు పోగొట్టుకున్నారు . పవర్ లో ఉన్నప్పుడు పవర్ లో లేనప్పుడు తేడా వుంటుంది బాస్ అంటున్నారు చింతమనేనిని ఉద్దేశించి నియోజకవర్గ ప్రజలు .

English summary
A complaint has been registered with the police by Satyanarayana, a farmer who complained that former MLA Chintamaneni Prabhakar and his supporters had allegedly shifted pipes set up to pump water to the Polavaram canal. These pipes are used for irrigation in the villages of Pedavegi Zone, Dedalur, Pedavegi, Pedapadu, and Eluru Rural zones. The farmers have alleged that former TDP MLA has allegedly done this unable to digest the defeat in the recent election 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X