జగన్ ఇంటి ఎదుట ఆందోళన: ఆళ్లగడ్డపై మైసూరా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. గురజాల నియోజకవర్గ పరిధిలో సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములు కోల్పోయిన రైతులు లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.
పంట పొలాల్లో జరిగిన దాడిలో గాయపడిన వారు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమపై అన్యాయంగా దాడి చేశారని రైతులు ఆరోపించారు.
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం: మైసూరా

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో దివంగత నేత శోభానాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో మిగిలిని రాజకీయ పార్టీలు పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని అనుసరించాలని ఇతర పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే విషయంపై అక్టోబర్ 15న తెలుగుదేశం పార్టీ నేతలను కలుస్తామన్నారు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతామని మైసూరారెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో తాము ఇదే సాంప్రదాయం పాటించామని ఈ సందర్బంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications