కోడలిపై మామ లైంగిక వేధింపులు..బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..సహకరించమన్న భర్త...ఎస్పీకి వివాహిత ఫిర్యాదు
కట్టుకున్న భర్త,అతని తండ్రి తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధాలకు అలవాటుపడిన భర్త... అతని తండ్రి లైంగిక వేధింపులకు వత్తాసు పలుకుతున్నాడని పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మామకు సహకరించాలంటూ భర్త కూడా వేధిస్తున్నాడని వాపోయింది. ఇటీవలి కాలంలో వీరి వేధింపులు ఎక్కువయ్యాయని... వారి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంది. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరింది.

భర్త వివాహేతర సంబంధాలు...
గుంటూరు జిల్లాలో సోమవారం(అగస్టు 2) నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన స్వాతి అనే వివాహిత తన పట్ల భర్త,మామ చేస్తున్న ఆగడాలను ఎస్పీకి వివరించింది. 2016లో సందీప్ అనే వ్యక్తితో తనకు వివాహం జరిగినట్లు తెలిపింది. అప్పటికే సందీప్‌కు మరో మహిళతో వివాహమవగా.. ఆమె నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పింది. పెళ్లి తర్వాత సందీప్ అసలు స్వరూపం బయటపడిందని తెలిపింది.
టిక్‌టాక్ ద్వారా పరిచయమైన అమ్మాయిలతో అతను వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని... కొన్నిసార్లు ఓ మహిళను ఇంటికి కూడా తీసుకొస్తుండేవాడని పేర్కొంది. ఇదే విషయం సందీప్ తల్లి పద్మావతికి చెబితే... ఆమె కూడా అతన్నే వెనకేసుకొచ్చేదని చెప్పింది.

మామ వేధింపులు... సహకరించమన్న భర్త...
2017లో పద్మావతి అనారోగ్యంతో మృతి చెందిందని... కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం సందీప్‌కు రావాల్సి ఉందని తెలిపింది. అయితే ఇందుకు తండ్రి శ్రీనివాసరావు నుంచి ఎన్‌ఓసీ అవసరం పడిందని చెప్పింది.కంభంపాడులో ఉండే మామ శ్రీనివాసరావు అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చి పోతుండేవాడని... తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని వాపోయింది. ఈ విషయం భర్తకు చెప్పినా అతన్నే వెనకేసుకొచ్చాడని.. సహకరించాలని చెప్పేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల శ్రీనివాసరావు వేదింపులు ఎక్కువయ్యాయని... బాత్రూమ్‌లోనూ రహస్యంగా కెమెరాలు పెట్టించాడని తెలిపింది. తనకు సహకరిస్తే అన్ని విధాలా న్యాయం చేస్తానని చెప్పేవాడని... భర్తకు చెబితే ఆయన చెప్పినట్లు చేయమనేవాడని బాధపడింది.
Recommended Video

లైంగిక దాడికి యత్నించిన మామ...
ఇదే క్రమంలో ఓరోజు మామ శ్రీనివాసరావు తనపై లైంగిక దాడికి యత్నించాడని... తప్పించుకుని తాను బయటకు పరిగెత్తానని తెలిపింది. తాను లొంగకపోతే రెండేళ్ల తన కుమార్తెపై లైంగిక దాడి చేస్తాడని హెచ్చరించాడని వాపోయింది. ఈ వేధింపులు భరించలేక తాను పుట్టింటికి వెళ్లానని... ఇటీవలి కాలంలో తన భర్త మళ్లీ తనను కలిసేందుకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. భర్త,మామల నుంచి ప్రాణహాని ఉన్నందునా తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరింది.












Click it and Unblock the Notifications