ఏడాది తర్వాత ఎట్టకేలకు?: హత్య చేసింది అతనే అని తెలిసి పోలీసుల షాక్..

Subscribe to Oneindia Telugu

కంభం: ఇదో హృదయ విదారక ఘటన. కొడుకుపై ఉన్న ప్రేమను చంపుకుని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన వైనం. పేద కుటుంబంలో అనారోగ్య సమస్యలు మనుషులను ఎంత క్షోభకు గురిచేస్తాయో తెలియజెప్పే సంఘటన ఇది.

ఏడాది క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనకు సంబంధించి ఎట్టకేలకు మిస్టరీ బయటపడింది. మిస్సింగ్ కాస్త హత్యగా తేలడం.. నిందితుడు తండ్రే అని గుర్తించడం.. పోలీసులకే షాక్ అనిపించింది.

పోలీసుల కథనం ప్రకారం..:

పోలీసుల కథనం ప్రకారం..:

ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన కుల్లూరి శ్రీనివాసరావుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో పెద్ద కొడుకు వెంకట్రావుకు 14ఏళ్ల నుంచే మూర్ఛ వ్యాధి సోకింది. ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా.. ఎక్కడెక్కడ చూపించినా వ్యాధి నయం కాలేదు.

చేతికొచ్చిన కొడుకు ఇలా:

చేతికొచ్చిన కొడుకు ఇలా:

చేతికి అందివచ్చిన కొడుకు తనకు ఆసరాగా ఉంటాడనుకుంటే.. వ్యాధితో బాధపడుతుండటం అతను తట్టుకోలేకపోయాడు. కుమారుడి బాధను చూసి కుమిలిపోయాడు. ఆ నైరాశ్యం నుంచే అమానవీయంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కొడుకును లేకుండా చేస్తే ఈ సమస్య ఉండదు కదా.. అన్న నిర్ణయానికి వచ్చాడు. చివరికి అతన్ని చంపడానికే నిర్ణయించుకున్నాడు.

గతేడాది హత్య

గతేడాది హత్య


గతేడాది నవంబరు 15 అర్ధరాత్రి వేళ వెంకట్రావుకు ఫిట్స్‌ వచ్చింది. ఆ సమయంలో కొడుకునే మోసుకుంటూ తండ్రి స్మశానం వైపు వెళ్లాడు. అక్కడే గొంతు నుమిలి హత్య చేసి.. మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. ఆపై మతిస్థిమితం లేక ఎక్కడికో వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులతో పాటు, చుట్టుపపక్కల వారిని నమ్మించాడు.

మిస్టరీ ఇలా వీడింది

మిస్టరీ ఇలా వీడింది

స్మశానంలో మృతదేహం సగానికి పైగా కాలిపోవడంతో.. దాన్ని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో కేసు దర్యాప్తుకు సరైన ఆధారాలు లేకుండా పోయాయి. అయితే తండ్రి పైనే మళ్లీ అనుమానం వచ్చిన పోలీసులు.. శ్రీనివాసరావును డీఎన్ఏ పరీక్షకు పిలవగా.. ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు.దీంతో పోలీసుల అనుమానం బలపడి.. డీఎన్ఏ పరీక్ష నిర్వహించడంతో అతనే హంతకుడని తేలిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 23years ill man murdered by his own father, who did not want him to undergo the physical and mental suffering

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి