మనసున్న పోలీసమ్మ...పివి రమణమ్మ:ఖాకీ మేడమ్ కరుణ

తూర్పుగోదావరి జిల్లా:పోలీస్ డ్రస్ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కాఠిన్యమే...అయితే ఖాకీ కరుకుతనం నేరస్తుల పట్లే కాని ఆపన్నల పట్ల కాదని...తాము లాఠీ కాఠిన్యమే కాదు...అవసరమైనప్పుడు కొండంత కరుణ కూడా చూపగలమని నిరూపించిందో పోలీసు అధికారి...మానవత్వపు పరిమణాలు ఎంత మధురమో చాటి చెప్పిన ఈ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ మీకోసం...

ఆ బాలిక ఒక దివ్యాంగురాలు...పదో తరగతి చదువుతోంది...ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో ఆ విద్యార్థిని పరీక్ష రాసేందుకని ఎగ్జామ్ సెంటర్ వద్దకు వచ్చింది. అయితే ట్రాఫిక్ కారణంగా పరీక్ష హాలు వద్దకు చేరుకునే అప్పటికే ఎంట్రీ సమయం అయిపోవచ్చింది.

female police officer also demonstrates kindness when needed

దివ్యాంగురాలు కావడంతో వేగంగా పరీక్ష హాలు వద్దకు వెళ్లే అవకాశం లేక...ఆందోళన చెందుతూ కన్నీళ్లు ఉబికివస్తుండగా...త్వరగా లోపలికి చేరుకోవాలని అవస్థ పడుతుంటే...అక్కడే విధి నిర్వహణలో ఉన్న మహిళా ఏఎస్ఐ పివి రమణమ్మ ఆ బాలిక కష్టాన్ని గమనించి...వెంటనే ఆ విద్యార్థిని అమాంతం తన చేతులపైకి ఎత్తుకొని వడివడిగా ఎగ్జామ్ హాల్లోకి చేర్చింది...సమయం మించేలోపే పరీక్ష హాల్లోకి చేరుకున్నఆ విద్యార్థిని ఆనందంగా ఊపిరి పీల్చుకోగా...ఆ ఖాకీ తల్లి హాయిగా నిట్టూర్చింది...ఇదీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలోని కడియం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద చోటు చేసుకున్నఅపురూప ఘట్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+