వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ వీడియో: హోటల్లో క్రీడాకారిణితో కోచ్ రొమాన్స్, రూంకి గర్ల్స్ క్యూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్: అర్ధరాత్రి హోటల్లో టీటీ క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోచ్ పైన వేటు పడింది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన క్యాడెట్, సబ్ జూనియర్ జాతీయ టీటీ ఛాంపియన్‌షిప్ కోసం వచ్చిన కోచ్.. అర్ధరాత్రి వేళ హోటల్ లాబీల్లో ఓ క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆటగాడు కూడా అయిన కోచ్ ఓ క్రీడాకారిణితో పెనుగులాడుతూ కనిపించాడు. ఆ తర్వాత మరికొందరు క్రీడాకారిణులు కోచ్ గదిలోకి వెళ్లి రావడం కనిపించింది. సీసీటీవీ దృశ్యాలు బయటపడటంతో దీని పైన ఛత్తీస్‌గఢ్ క్రీడావర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ఆ కోచ్ పైన టీటీ సంఘం వేటు వేసింది. సంఘం కార్యదర్శి రాజీనామా చేశారు.

జాతీయ టీటీ ఛాంపియన్‌షిప్ కోచ్, క్రీడాకారిణిల రొమాంటిక్ సన్నివేశం తర్వాత.. పురుష కోచ్ గదిలోకి అమ్మాయిలు వెళ్లడం.. ఇదంతా అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో చోటు చేసుకుంది. డిసెంబర్ 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జాతీయ టీటీని కుదిపేస్తోంది.

 Female Table Tennis Player, Male Coach Suspended Over Shocking CCTV Footage

లీకైన ఈ వీడియో పైన జాతీయ టీటీ సంఘం ఘాటుగా స్పందించింది. కోచ్‌తో పాటు క్రీడాకారిణి పైన రానున్న జాతీయ పైన రానున్న జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేసింది. కాగా, జట్టుతో పాటు కోచ్ బృందంలో మహిళా కోచ్‌ను పంపించాలి. కాని ఇక్కడ అలా జరగలేదు.

ఛత్తీస్‌గఢ్ నుండి మొత్తం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు జాతీయ టోర్నీలో పాల్గొంది. ఈ ఉదంతం పైన భారత టీటీ సమాఖ్య కార్యదర్శిధనరాజ్ మాట్లాడారు. తాను ఆ వీడియోను చూశానని, అందులో ఎలాంటి అనైతికత కనబడలేదని, ఏ క్రీడాకారిణి ఫిర్యాదు చేయలేదని, అయినా దీనికి బాధ్యత వహిస్తూ కార్యదర్శి రాజీనామా చేశారన్నారు. కాగా, నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు.

English summary
In a shocking CCTV footage, few junior female table tennis players from Chhattisgarh were seen coming out of their male coach's hotel room late at night on December 26, 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X