జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ నాయకులు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు చేరారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లెకు చేరుకున్న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, వైసీపీలో గుంటూరు నేతల చేరికతో ఆ పార్టీలో స్థానికంగా కొత్త ఉత్సాహం నెలకొంది.












Click it and Unblock the Notifications