వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్యంగా ఫొటోలు: ఐదు నెలలుగా గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లాలో కొందరు యువకులు ఓ యువతి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌లో దొంగచాటుగా ఫొటోలు తీసి, ఐదునెలలుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వేధించసాగారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడుతూ వచ్చారు. బయటకు చెప్తే కుటుంబ పరువు పోతుందని ఇన్నాళ్లూ సహించిన ఆ విద్యార్థిని యువకుల వేధింపులు మితిమీరడంతోభరించలేక తన కష్టాన్ని తల్లితో చెప్పుకుంది. వెంటనే తల్లి పోలీసుల కు ఫిర్యాదు చేసింది.

పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గజపతినగరం మండలం పురిటిపెంటలో ఐదునెలల కిందట ఓ విద్యార్థిని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ప్రవీణ్‌ అనే యువకుడు దగ్గర్లో ఉన్న మేడపైనుంచి సెల్‌లో ఫొటోలు తీశాడు. అనంతరం తన సెల్‌షాపునకు వచ్చే మరో నలుగురికి వాటిని చూపించాడు. ఆ తర్వాత విద్యార్థినికి కూడా ఫొటోలను చ పించి ఆ ఐదుగురూ బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు.

Few youngsters in Vijayanagaram district gang raped a girl

ఇదే క్రమంలో ఆమెను వేరేచోటుకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. అక్కడ కూడా సెల్‌లో ఫొటోలు తీసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, తాము ఎప్పుడు ఎక్కడి కి రమ్మంటే అక్కడకు రావాలని, లేదంటే ఆ ఫోటోలను బయటపెడతామని బెదిరిస్తూ వస్తున్నారు. ఫొటోలను నెట్‌లో కూడా పెట్టేస్తామని హెచ్చరిస్తున్నారు. ఐదు నెలలుగా ఈ చిత్రవధను అనుభవిస్తూ వస్తున్న బాధితురాలు వారి టార్చర్‌ మరింత పెరిగిపోవడంతో భరించలేక ఆదివారం ఆమె తన తల్లిదండ్రులకు సమస్యను చెప్పుకొని కన్నీరుమున్నీరైంది.

ఈ నేపథ్యంలో కుమార్తెతో కలసి తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విషయాన్ని సీరియస్‌గా పరిగణించి వెంటనే విచారణ ప్రారంభించారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో గ్రామపెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య రాజీయత్నాలు చేసినప్పటికీ చివరకు అవి ఫలించకపోవడంతో కేసు నమోదైంది. నిందితులు ప్రవీణ్‌, శివాజీ, భానుప్రసాద్‌, జితేంధ్ర, శ్రీకాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
Few youngsters in Vijayanagaram district gang raped a girl for five months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X