వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసాపురం వైసీపీ పోరు- ప్రసాదరాజుకు వ్యతిరేకంగా పావులు-సుబ్బారాయుడు గన్ మెన్ల తొలగింపు

|
Google Oneindia TeluguNews

ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం వెనుక ఉన్న కారణాల్లో సామాజిక వర్గాల ఓట్ల ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల మధ్య సమన్వయం సాధించడంలో వైఎస్ జగన్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఇప్పుడు అవే వ్యూహాలు ఎదురుతంతున్నాయి. కాపులు వర్సెస్ రాజుల పోరు సాగే భీమవరం జిల్లాలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగన్ విధేయుడు ప్రసాదరాజుకు అగ్రతాంబూలం ఇచ్చే క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లిసుబ్బారాయుడికి వైసీపీ పొగబెడుతోంది.

నరసాపురం వైసీపీ విభేదాలు

నరసాపురం వైసీపీ విభేదాలు


నరసాపురంలో అధికార వైసీపీలో పోరు ముదురుతోంది. స్ధానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లిసుబ్బారాయుడికీ మధ్య నెలకొన్న విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ పరువు బజారుకీడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రసాదరాజుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అధిష్టానం నుంచి షాకులు తగులుతున్నాయి. దీంతో ఈ పోరు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ప్రసాదరాజు వర్సెస్ సుబ్బారాయుడు

ప్రసాదరాజు వర్సెస్ సుబ్బారాయుడు


వైసీపీ ఆవిర్భావానికి ముందే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా పేరు తెచ్చుకున్న స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుకూ, టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ నేత సుబ్బారాయుడికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి. జగన్ తో ఉన్న అనుబంధం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో హవా కొనసాగిస్తున్న ప్రసాదరాజుకు కొత్తపల్లి సుబ్బారాయుడు కంటగింపుగా మారారు. నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో వైసీపీ అధిష్టానానికి కూడా తలనొప్పులు తప్పడం లేదు. చివరికి వీరిద్దరి మధ్య పోరుతో నియోజకవర్గంలో వైసీపీ క్షత్రియులు వర్సెస్ కాపులుగా చీలిపోతోంది.

 ప్రసాదరాజుకు అండగా జగన్

ప్రసాదరాజుకు అండగా జగన్

వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచే వైఎస్ కుటుంబ విధేయుడిగా పేరు తెచ్చుకున్న ప్రసాదరాజుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత పరపతి పెరిగింది. దీనికి తోడు జగన్ అండదండలతో ఆయన బలం పెంచుకుంటూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లోనూ తనమాటే నెగ్గేలా చూసుకుంటున్నారు. పార్టీపైనా ఆయన పట్టు పెరుగుతోంది. దీంతో ఇదంతా కొత్తపల్లి సుబ్బారాయుడికి ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటులోనూ నరసాపురం జిల్లా కోసం సుబ్బారాయుడు ఉద్యమించగా.. ప్రసాదరాజుతో పాటు అధిష్టానం పెద్దలు కూడా ఆయన తీరును తప్పుబట్టారు. దీంతో పాటు తాజాగా ప్రసాదరాజుకు కేబినెట్ లో చోటు చక్కకపోయినా ఛీఫ్ విప్ గా అవకాశం దక్కింది. దీంతో సుబ్బారాయుడి కష్టాలు మరింత పెరిగాయి.

సుబ్బారాయుడి గన్ మెన్ల తొలగింపు

సుబ్బారాయుడి గన్ మెన్ల తొలగింపు


నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమానంగా గన్ మెన్లు ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడికి వైసీపీ అధిష్టానం వరుస షాకులిస్తోంది. ఇప్పటికే ఆయన కోరిన విధంగా నరసాపురం జిల్లా చేయకుండా భీమవరం జిల్లాతోనే సరిపెట్టిన జగన్.. తాజాగా సుబ్బారాయుడి గన్ మెన్లను కూడా తొలగించారు.. దీంతో సుబ్బారాయుడు వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే త్వరలో ఆయన టీడీపీ గూటికి తిరిగి చేరినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ మంత్రిగా పనిచేసిన సుబ్బారాయుడికి ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలో చేరి కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. టీడీపీకి అధికారం పోయాక వైసీపీలో చేరారు. దీంతో ఈ వలసలే ఆయనకు శాపంగా మారిపోయాయి.

English summary
ap government has removed gunmen security to former minister and ysrcp leader kothapalli subbarayudu amid fight with narasapuram mla prasada raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X