బాణసంచా పేలి ఒకరి మృతి: చెరువులో స్త్రీల మృతి

 Fir accident in Vijayanagrama district, one dead
విజయనగరం: విజయనగరం జిల్లాలో శనివారం సంభవించిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. జిల్లాలోని సాలూరు చిన్న వీధిలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాణాసంచాను అక్రమంగా తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోనే ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. జిల్లాలోని గుంకాలం చెరువులో బట్టలు ఉతుకుతుండగా జారి చెరువులో పడ్డారు. దాంతో వారు మరణించారు. వర్షాల కారణంగా నేల తడిగా ఉండడంతో చెరువులో దుస్తులు ఉతుకుతున్నప్పుడు ఇద్దరు మహిళలు కూరుకుపోయారు. వారిద్దరిని రక్షించడానికి ప్రయత్నించిన మరో మహిళ కూడా చెరువులో కూరుకుపోయి మరణించింది. విషయం తెలిసిన పొలాల్లోని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు.

అదుపు తప్పిన స్కూల్ బస్సు

ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం అంకేపల్లి దగ్గర శనివారం ఉదయం ఓ స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆబ్కారీ దాడులు

విశాఖపట్నం నగరంలోని నర్సీపట్నం దగ్గర శనివారం ఉదయం ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న రూ.2.5 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌ను సీజ్‌ చేయగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+