వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమలాపురం విధ్వంసం వెనుక - కీలక వ్యక్తుల గుర్తింపు : నేడు మరిన్ని అరెస్టులు..!!

|
Google Oneindia TeluguNews

ప్రశాంతంగా ఉండే కోనసీమలో చిచ్చు పెట్టిందెవరు. విధ్వంసం వెనుక సూత్రధారులు ఎవరనేది తేల్చే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే విధ్వంసం నాటి సీసీ ఫుటేజ్ తో పాటుగా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న సమాచారంతో సూత్రధారులు - పాత్రధారులను గుర్తించే పని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా బాధ్యులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అమలాపురం సహా పరిసర గ్రామల నుంచి నుంచి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం నాటికి అల్లర్లలో పాల్గొన్నవారిలో వెయ్యి మందిని గుర్తించారు. వీరిలో 46 మందిని కీలక వ్యక్తులుగా భావించి ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చారు.

43 మందిపై కేసులు నమోదు

43 మందిపై కేసులు నమోదు

అందుతున్న సమాచారం మేరకు బిజెపి కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, కార్యకర్త రాంబాబుతో పాటు కాపునేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు అజరుతో సహా 43 మందిపై కేసులు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన కానిస్టేబుల్‌ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు వీరందరిపై కేసు నమోదు చేశారు. విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్‌ తెరిచారు. ఈ నెల 20న కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జెఎసి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్‌ ముట్టడిలో అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

రావులపాలెంలో అప్రమత్తం

రావులపాలెంలో అప్రమత్తం


24న జరిగిన విధ్వంసం ఘటనలోనూ అతను కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్‌ 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 ఆర్‌/డబ్ల్యూ 149 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రావులపాలెంలో గురువారం జరిగిన కవ్వింపు చర్యలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కొత్తపేట నియోజకవర్గానికి ఐదవ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు. అమలాపురంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల అడిషినల్‌ డిజి రవిశంకర్‌ ఆధ్వర్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పోలీసు ఉన్నతాధికారుల మకాం

పోలీసు ఉన్నతాధికారుల మకాం


ఏలూరు రేంజి డిఐజి పాల్ రాజు, ఎపిఎస్‌పి ఆరవ బెటాలియన్‌ కమాండెంట్‌ విశాల్‌ గున్నీ, కృష్ణా జిల్లా ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌, కాకినాడ జిల్లా ఎస్‌పి రవీంద్రబాబు ఆధ్వర్యంలో 1,400 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండో రోజూ కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. మొదటి రోజు గంటపాటు మాత్రమే ఇంటర్నెట్‌ను నిలిపేసిన అధికారులు, ఘటన జరిగిన రెండో రోజు నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను బంద్‌ చేశారు. ఈ రోజు కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. విధ్వంసానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా.. ఎవరైనా వదిలేది లేదని..చర్యలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary
Police investigation on Amalapuram violence and traced 46 persons behind this episode, cases regsistered against 43 persons as per reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X