బేగంబజార్ బాణాసంచా దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: బేగంబజార్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పీల్ ఖానా వద్ద నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపులోని బాణాసంచా తగలడటంతో మంటలు మరింత వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటున్నాయి.

సమాచారాం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో మంటలను ఆర్పేశారు. అనుమతి లేకుండా జనవాసాల్లో బాణాసంచా దుకాణం ఏర్పాటు చేసిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో దీనిని తరలిస్తున్న నలుగురిని శనివారం అరెస్ట్ చేశారు.

Fire accident at Begumbazar

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ప్రకాశం: జిల్లాలోని ఒంగోలు సమీపంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. గుంటూరు వైపు బాయిలర్ కోళ్లతో వస్తున్న మినీ లారీ, ఒంగోలు వైపు నుంచి వస్తున్న కంటెయినర్ ఢీకొన్నాయి.

ఈ ఘటనలో మినీలారీ అటుగా వెళ్తున్న మోటారు వాహనంపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళుతున్న ఇద్దరు జాతీయ రహదారి నిర్మాణ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. లారీలు రోడ్డుకు అడ్డంగా పడటంతో దాదాపు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

అనంతపురం: జిల్లాలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కళ్యాణదుర్గం మండలం దొడగట్టకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీరాం కుమారులు పవన్, సంతోష్ శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు వారికోసం వెదుకులాట ప్రారంభించారు.

సాయంత్రం వరకు వెదికినా ఫలితం లేకపోవడంతో కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం చిన్నారుల మృతదేహాలు దొడగట్ట శివార్లలో కొండపక్కన ఉన్న నీటికుంట వద్ద కనిపించాయి. పిల్లలు ప్రమాదవశాత్తు పడి చనిపోయారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+