ఫార్మా కంపెనీలో పేలుడుతో ఎగిసిన మంటలు: ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
జిల్లాలోని పరవాడలోని ఎజికో బయో ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
విశాఖపట్నం: జిల్లాలోని పరవాడలోని ఎజికో బయో ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
మంగళవారం ఉదయం ఎజికో ఫార్మా కంపెనీలో రియాక్టర్ మ్యాన్ హోల్ ఓపెన్ అయి ఆ ప్రాంతమంతా మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడేవున్న కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు కార్మికులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శివకుమార్, నాగేశ్వరరావు అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications