తొలి విడ‌త ఎన్నిక‌ల‌తో న‌ష్టం జ‌రిగిందా : బాబు మాటల్లో ప‌ర‌మార్దం ఏంటి : వైసిపి చెబుతుందేంటి..!

Recommended Video

    Ap Assembly Election 2019 : తొలి విడ‌త ఎన్నిక‌ల‌తో న‌ష్టం జ‌రిగిందా...?? || Oneindia Telugu

    ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. పార్టీలు పోస్టుమార్టం మొద‌లు పెట్టాయి. తొలుత ఎప్పుడు జ‌రిగినా విజ‌యం మాదేనం టూ ధీమా వ్య‌క్తం చేసిన పార్టీలు ఇప్పుడు స‌న్నాయి నొక్కులు మొద‌లు పెట్టాయి. ఏపి - తెలంగాణ లో తొలి విడ‌త లో నే ఎన్ని క‌లు జ‌రిగాయి. ఎప్పుడు ఎన్నిక‌లు పెట్టినా ఏపి - తెలంగాణ లో ఒకే సారి ఎన్నిక‌లు పెట్టాల‌ని వైసిపి కోరింది. తొలుత తొలి విడ‌త ఎన్నిక‌లు త‌మ‌కే మేలు చేస్తుంద‌న్న చంద్ర‌బాబు..ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఇంత‌కీ ఆయ‌న చెబుతుందేంటి..ఆ మాటల్లో ప‌ర‌మార్ధం ఏంటి..

    తొలి విడ‌త ఎన్నిక‌లతో మాకే మేలు..

    తొలి విడ‌త ఎన్నిక‌లతో మాకే మేలు..

    ఎన్నిక‌ల సంఘం మార్చి లో ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించింది. అందులో తొలి విడ‌త లోనే ఏపి అసెంబ్లీ ఎన్నిక‌లు.. అదే విడ‌త‌లో తెలంగాణ‌లో లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలో తొలి విడ‌త ఎన్నిక‌ల‌కు ఏపి లో అధికార పార్టీ సిద్దంగా లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అప్పటికే అభ్య‌ర్దుల ఖ‌రారు పై దృష్టి పెట్టిన చంద్ర బాబు..షెడ్యూల్ విడుద‌ల తరువాత మాత్రం తొలి విడ‌త లో ఎన్నిక‌లు త‌మ‌కే మేలు చేస్తాయ‌ని చెప్పుకొచ్చారు. ఏపి లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేసుకొని దేశ వ్యాప్త ప్ర‌చ‌రం లోకి వెళ్తాన‌ని వివ‌రించారు. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారం లోకి దిగిన త‌రువాత ఎన్నిక‌ల సంఘం అధికారుల బ‌దిలీల పై తీసుకున్న నిర్ణ‌యాల పై ప్ర‌చార స‌భ‌ల్లో చంద్ర‌బాబు త‌ప్పు బ‌ట్టా రు. ఇక‌, పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ ఎన్నిక‌ల సంఘం పై పోరు తీవ్ర త‌రం చేసారు.

    దెబ్బ తీసేందుకే తొలి విడ‌త‌లో..

    దెబ్బ తీసేందుకే తొలి విడ‌త‌లో..

    ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత టిడిపి అధినేత చంద్ర‌బాబు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఎన్నిక‌ల సంఘం తీసు కున్న నిర్ణ‌యాల‌ను పూర్తిగా త‌ప్పు బడుతున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని బ‌దిలీ చేయ‌టం పై చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఏపి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా కూడా చేసారు. ఇక‌, పోలిం గ్ రోజు ఇవియం ల స‌మ‌స్య పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో తాము 150 ప్లస్ సీట్లు గెలుస్తామ‌ని చెబుతూనే కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏపిలో 2014 లో చివ‌రి ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రిగితే..ఇప్పుడు తొలి విడ‌త లో ఎం దుకు ఎన్నిక‌లు పెట్టార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. తాను ఎన్నిక‌ల‌కు సిద్దం అవ్వ‌టానికి స‌మ‌యం ఇవ్వ‌కుండా ఉండ‌టానికే ప్ర‌ధాని మోదీ సూచ‌న‌ల మేర‌కు ఎన్నిక‌ల సంఘం తొలి విడ‌తలోనే ఏపిలో ఎన్నిక‌లు నిర్వ‌హించింద‌ని ఆక్షేపించారు. అయితే, చంద్ర‌బాబు తాజా వ్యాఖ్య‌ల ద్వారా నిజంగా తొలి విడ‌త ఎన్నిక‌ల ద్వారా టిడిపికి న‌ష్టం జ‌రిగిం దా..150 ప్ల‌స్ సీట్లు గెలుస్తామ‌ని చెబుతున్న మాట‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నే అంశం పై చ‌ర్చ మొదలైంది.

     వైసిపి చెబుతుందేంటంటే..

    వైసిపి చెబుతుందేంటంటే..

    వైసిపి నేత‌లు మాత్రం తొలి విడ‌త పోలింగ్ ద్వారా త‌మ‌కు ఎటువంటి నష్టం లేద‌ని చెబుతున్నారు. వైసిపి అధినేత జ‌గ‌న్ దాదాపు 14 నెల‌ల పాటు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోనే ఉన్నార‌ని..ముందు నుండి ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవ్వ‌టం కార‌ణంగా త‌మ పై ఎటువంటి ప్ర‌భావం చూప‌లేద‌ని చెబుతున్నారు. రెండేళ్లు ముందుగానే న‌వ ర‌త్నాల‌ను ప్ర‌క‌టించటం..వాటికి విస్తృ ప్ర‌చారం క‌ల్పించ‌టం ద్వారా తాము రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవ్వ టం మొద‌లు పెట్టామ‌ని వివ‌రిస్తున్నారు. అయితే, కొంద‌రు నేత‌లు మాత్రం తొలి విడ‌తలోనే ఎన్నిక‌లు జ‌రిగిన కార‌ణం గా కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌చారం చేసే అవ‌కాశం లేకుండా పోయింద‌ని..అది ఎంత కొంత ఎన్నిక ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. హోరా హోరీ పోరులో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గం కీల‌కం అయిన ఈ సంద‌ర్భంలో స‌మ‌యం లేక పోవ‌టం..రోజుకు మూడు లేదా నాలుగు స‌భ‌ల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమితం అవ్వ‌టం ఇక రాత్రికి ఎటువంటి ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ కు వెళ్లిపోవ‌టం కూడా అభ్య‌ర్దుల పై ప్ర‌భావం చూపించింద‌ని చెబుతున్నారు. మ‌రి..తొలి విడ‌త ఎన్నిక‌ల కార‌ణంగా ఎవ‌రికి న‌ష్టం జ‌రిగిందో..ఎవరికి మేలు జ‌రిగిందో మే 23 వ తేదీన తేల‌నుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+