వాయుగుండంగా మారనున్న అల్పపీడనం .. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశం
హైదరాబాద్ : వరుణ దేవుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందనే వాతావారణ శాఖ అంచనాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందనే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.

అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వెల్లడించింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలుుల వీచే అవకాశం ఉందని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరిక జారీచేసింది. మరోవైపు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణశాఖ అప్రమత్తతతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications