విషాదం:విషవాయువులు లీకై ఐదుగురు మృతి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లవారి చెరువులో ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం ఉదయం విషవాయువులు వెలువడ్డాయి.రసాయన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఆ ప్రమాదం చోటుచేసుకొంది.
ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డురాంబాబు, తోట శ్రీనువాస్, జక్కంశెట్టి ప్రవీణ్ లు మృతి చెందారని గుర్తించారు.













Click it and Unblock the Notifications