దువ్వుతున్న టిడిపి: జగన్‌కు మరో 5గురు షాకిచ్చేనా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కుదుపు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు పార్లమెంటు సభ్యులు షాకిచ్చారు. వారి దారిలోనే మరికొందరు ప్రజాప్రతినిధులు నడిచే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. దానిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొట్టి వేస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.
తాజాగా, కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కొట్టి పారేయలేమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు టిడిపిలో చేరి ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేశారు. మాజీ మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ఓడిపోయారు.

జిల్లాకు చెందిన టిడిపి నేతలు జగన్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారట. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు టిడిపి నేతలతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. కడప జిల్లా టిడిపి నేత వారితో చర్చలు జరుపుతున్నారట. పలువురు కడప జిల్లా ఎమ్మెల్యేల పైనా టిడిపి దృష్టి పడిందంటున్నారు.
కర్నూలు జెడ్పీ చైర్మన్ పైన టిడిపి కన్ను
కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను, ఎంపీలను, జెడ్పీటీసీలను తమ పార్టీలో చేర్చుకొని జెడ్పీ చైర్మన్ పదవిని వశం చేసుకోవాలని టిడిపి భావిస్తోందని అంటున్నారు. కర్నూలు జిల్లాలో వైయస్సారగ్ కాంగ్రెసు పార్టీకి 30 జెడ్పీటీసీలు, టిడిపికి 20 జెడ్పీటీసీలు ఉన్నాయి. పలువురు జెడ్పీటీసీలను టిడిపి వైపు చూస్తున్నారట.












Click it and Unblock the Notifications