కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాలు - పిక్చర్స్: మిద్దె కూలి 5గురు మృతి (వీడియో)

|
Google Oneindia TeluguNews

కడప/విశాఖ: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం ఉచ్చలవరంలో వర్షాల కారణంగా పాత మిద్దె కూలి ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది నలభై క్రితం నిర్మించిన పక్కా గృహం. శిథిలావస్థకు చేరుకుంది.

దీంతో కుండపోతగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా మంగళవారం ఉదయం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని గురప్ప(55), అతని భార్య పెంచలమ్మ(50), కుమార్తె హరిత(23), మనుమలు నవనీత్(5), యశ్వంత్(18నెలలు) మృతి చెందారు.

ప్రమాదంలో మరో కుమార్తె లలిత, మనువరాలు నిహారికలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. హోంమంత్రి చినరాజప్ప భవనం కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైదుకూరు మండలం

ఉచ్చలవరంలో వర్షాల కారణంగా పాత మిద్దె కూలి ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది నలభై క్రితం నిర్మించిన పక్కా గృహం. శిథిలావస్థకు చేరుకుంది.

విశాఖలో వర్షం

విశాఖలో వర్షం

విశాఖలో సోమవారం నాడు భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది.

విశాఖలో వర్షం

విశాఖలో వర్షం

కలెక్టరేట్ భవనంలో వర్షం నీరు కారుతోంది. కొత్త కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ బాధ్యతలు చేపట్టే సమయంలో వర్షం పడింది. వర్షపు నీరు కారిపోవడంతో ఆ నీటి కోసం బకెట్లు పెట్టారు.

 విశాఖలో వర్షం

విశాఖలో వర్షం

మరట్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో వైపు చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు... దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

 విశాఖలో వర్షం

విశాఖలో వర్షం

వీటి ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

English summary
Five Killed As Building Collapses Due To Heavy Rain In Kadappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X