ఆటోతో పగలు రెక్కీ, రాత్రి పూట చోరీ (ఫోటోలు)

విశాఖపట్నం: దురలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడున్న ఐదుగురు యువకులను ఆరిలోవ, టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 120 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులు, ఐదు ఇత్తడి విగ్రహాలు, ఒక ఆటో, రెండు బైక్‌లు, ఒక కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ క్రైం ఏడీసీపీ ఎస్. వరదరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ, దుర్గానగర్‌కు చెందిన పుక్కల్ల శ్రీను, సుందర్ నగర్‌కు చెందిన షేక్ అహ్మాద్ వలీ, పూర్ణామార్కెట్ దరి కళ్లుపాకలకు చెందిన ఈగల కసకరాజు, పెదగదిలి, సాలిపేటకు చెందిన బొబ్బిలి చిన్నా, రవీంద్రనగర్‌కు చెందిన వేపాడ సాయి పలు కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

ఆ సమయంలో వారు స్నేహితులుగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారంతా కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. నిందితుల్లో ఒకరైన ఈగల కనకరాజు ఆటోలో తిరుగుతూ పగటి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసే వాడు.

రాత్రి సమయంలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాలాక్షినగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్ ప్రాంతాల్లో 11 దొంగతనాలు, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లిపురం గౌరీవీధి, బంగారుమెట్ట, మిరపకాయల వీధి ప్రాంతాల్లో మూడు, మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంవీపీ సెక్టార్ 6లో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డారు.

శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హనుమంతువాక జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన సొత్తును ఆటో, రెండు బైకులపై అమ్మేందుకు తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

 చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

ఆరిలోవ, దుర్గానగర్‌కు చెందిన పుక్కల్ల శ్రీను, సుందర్ నగర్‌కు చెందిన షేక్ అహ్మాద్ వలీ, పూర్ణామార్కెట్ దరి కళ్లుపాకలకు చెందిన ఈగల కసకరాజు, పెదగదిలి, సాలిపేటకు చెందిన బొబ్బిలి చిన్నా, రవీంద్రనగర్‌కు చెందిన వేపాడ సాయి పలు కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

 చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

ఆ సమయంలో వారు స్నేహితులుగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారంతా కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. నిందితుల్లో ఒకరైన ఈగల కనకరాజు ఆటోలో తిరుగుతూ పగటి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసే వాడు.

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

దురలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడున్న ఐదుగురు యువకులను ఆరిలోవ, టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

చోరీలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు అరెస్టు

వారి వద్ద నుంచి సుమారు 120 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులు, ఐదు ఇత్తడి విగ్రహాలు, ఒక ఆటో, రెండు బైక్‌లు, ఒక కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+