విషాదం: కుటుంబం ఆత్మహత్య, ఐదుగురు మృతి

ప్రసాద్, ఆయన భార్య సునీత, తల్లి, ఇద్దరు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
బంగారం స్వాధీనం
కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న ఆరు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉపాధ్యాయుడిని చితకబాదారు
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం డీకంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడు రఘుపతిపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. బడితె పూజ చేసిన గ్రామస్థులు అతడ్ని తరగతి గదిలోనే నిర్బంధించారు.












Click it and Unblock the Notifications