ఆ తెలుగు కాంట్రాక్టర్ సంపద 13వేల కోట్లు: అత్యంత ధనవంతుల జాబితా: తొలి వంద మందిలో అయిదుగురు మన వాళ్లే.
తెలుగువారు సైతం అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు. మొదటి వందమంది జాబితాలో చోటు సంపాదించారు. ఏపీ..తెలంగాణలో ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తికి తొలి స్థానం దక్కగా .. ప్రముఖ కాంట్రాక్టర్ ఉన్న ప్రముఖుడు తెలుగు రాష్ట్రాలల్లో రెండో స్థానం లో ఉన్నారు. ఆ తరువాతి స్థానం అదే సంస్థకు చెందిన వ్యక్తికే దక్కింది. ఐఐఎ్‌ఫఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. దేశంలో 2018 సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన సంపన్నులు 831 మంది ఉండగా.. 2019 సంవత్సరంలో వీరి సంఖ్య 953కు పెరిగింది. ఈ జాబితాలో రూ.3,80,700 కోట్ల ఆస్తితో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలోను,రూ.1,86,500 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో హిందుజా కుటుంబం ఉన్నాయి. టాప్ 100లో ఐదుగురు తెలుగు పారిశ్రామికవేత్తలున్నారు.

టాప్ 100లో ఐదుగురు తెలుగు వారు..
ఐఐఎఎఫ్ ఎల్ వెల్త్ ధనవంతుల జాబితా ప్రకటించింది. అందులో తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు స్థానం దక్కింది. రూ.3,80,700 కోట్ల ఆస్తితో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలోను,రూ.1,86,500 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో హిందుజా కుటుంబం ఉన్నాయి. మూడో స్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ (రూ.1,17,100 కోట్లు) నిలిచారు. నాలుగో స్థానంలో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్, సీఈఓ ఎల్‌ఎన్ మిట్టల్ (రూ.1,07,300 కోట్లు), ఐదో స్థానంలో గౌతమ్ అదానీ (రూ.94,500 కోట్లు), ఆరో స్థానంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ సారథి ఉదయ్ కోటక్ (రూ.94,100 కోట్లు), ఏడో స్థానంలో సైరస్ మిస్ర్తీ (రూ.88,800 కోట్లు), ఎనిమిదో స్థానంలో సైరస్ పల్లోంజీ మిస్ర్తీ (రూ.76,800 కోట్లు), తొమ్మిదో స్థానంలో షాపూర్జీ పల్లోంజీ (రూ.76,800 కోట్లు), పదో స్థానంలో సన్‌ఫార్మాసూటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ (రూ.71,500 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. అందునా తొలి వంద మంది జాబితాలో అయిదుగురు తెలుగు వారు ఉన్నారు.

తెలుగు వారిలో అత్యంత ధనవంతుడిగా రాం ప్రసాద్ రెడ్డి..
ఐఐఎ్‌ఫఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం తొలి వంద మంది అత్యంత ధనవంతుల జాబితాలో అయిదుగురు తెలుగు వారు చోటు దక్కించుకున్నారు. వారిలో అరబిందో ఫార్మా పీవీ రాం ప్రసాద్ రెడ్డి 14,800 కోట్లతో తొలి వంద మందిలో 51వ స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానంలో ఏపీ..తెలంగాణల్లో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అధిపతి..మేఘా సంస్థల చైర్మన్ పీపీరెడ్డి 57వ స్థానంలో ఉన్నారు.
ఆయన రూ.13,400 కోట్లతో 57వ స్థానంలో నిలిచారు. తరువాత అదే మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఎండీ పీవీకే రెడ్డి రూ.12,900 కోట్లతో 63వ స్థానంలో ఉన్నారు. 83వ స్థానంలో దివీస్ కిరణ్ రూ. 10,200 కోట్ల సంపాదనతో నిలవగా.. 89వ స్థానంలో దివీస్ నీలిమ మోటపర్తి రూ.9,800 కోట్లతో ఉన్నారని ఈ జాబితాను విడుదల చేసిన ఐఐఎఎఫ్ ఎల్ వెల్త్ అనే సంస్థ వెల్లడించింది. అదే విధంగా వెయ్యి కోట్ల సంపాదనలో జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు.

హై హోం నుండి అయిుదుగురు..నవయుగ నుండి నలుగురికి..
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు ఆయన కుటుంబానికి 174వ స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన రూ. 4,500 కోట్లుగా ఉంది. అదే విధంగా మై హోం సంస్థకు చెందిన . జూపల్లి రామూ రావు రూ 1,400 కోట్లతో 588వ స్థానం, జూపల్లి రంజిత్ రావు రూ. 1,400 కోట్లతో 588వ స్థానం, జూపల్లి వినోద్ రూ. 1400 కోట్లతో 588వ స్థానం ఇలా.. ఇదే సంస్థకు చెందిన ముగ్గురు ఒకే ర్యాంకు ..ఒకే రకమైన సంపాదనతో నిలిచినట్లు సంస్థ వెల్లడించింది.
కాగా..జూపల్లి శ్యాం రావు రూ.1,300 కోట్లతో 638వ స్థానంలో ఉన్నారు. ఇక, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ కు చెందిన సీ విశ్వేశ్వరరావు రూ. 2,400 కోట్ల సంపాదనతో 373వ స్థానంలో ఉన్నారు. ఇదే సంస్థకు చెందిన చింతా శశిధర్ రూ 1,600 కోట్లతో 537వ స్థానంలో నిలిచారు. లక్ష్మీ ప్రియదర్శిని చింత రూ 1,300 కోట్లతో 638వ స్థానంలో, చింతా శ్రీధర్ రూ. 1,200 కోట్లతో 694వ స్థానంలో నిలిచారు. ఇలా.. మొత్తం 74 మంది ఈ జాబితాలో తెలుగు వారికి స్థానం దక్కింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications