బ్యాంకులు, ఏటిఎంలే టార్గెట్: 5గురు సభ్యుల దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్: జిల్లాలోని లక్సెట్టిపేటలో ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఓ తుపాకి, మూడు రౌండ్ల బుల్లెట్లు, రెండు బైక్‌లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తుపాకీని దొంగలముఠా ముంబైలో కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంది. మంచిర్యాల, లక్సెట్టిపేట, మందమర్రి ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంలను టార్గెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులకు చిక్కిన మాల్ ప్రాక్టీస్ ముఠా

హైదరాబాద్: మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న కొంతమంది ముఠా సభ్యులను శనివారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూరవిద్య ద్వారా నాగార్జున యూనివర్శిటీ నిర్వహిస్తున్న పరీక్షల్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.
ఈ ఘటనకు సంబంధించి పలు కళాశాలల యజమానులు, ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిచ్చికుక్క స్వైరవిహారం : 20మందికి గాయాలు
వరంగల్: జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు బాలుర పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications