గుంటూరులో విషాదం: విరుచుకుపడ్డ వీధికుక్కలు.. బాలుడు మృతి
గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఐదేళ్ల బాలుడిపై మూకుమ్మడిగా విరుచుకుపడి అతని ప్రాణాలు బలిగొన్నాయి. కుక్కల దాడి ఘటన గుంటూరులో కలకలం రేపింది.
గుంటూరు: గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఐదేళ్ల బాలుడిపై మూకుమ్మడిగా విరుచుకుపడి అతని ప్రాణాలు బలిగొన్నాయి. కుక్కల దాడి ఘటన గుంటూరులో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద బాలుడు ఆడుకుంటుండగా కుక్కలన్ని ఒక్కసారిగా అటు వైపు వచ్చాయి. బాలుడు కిందపడటంతో అతని మీద పడి దాడి చేశాయి. బాలుడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుక్కల దాడి అనంతరం కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని చూసి స్థానికులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన గుంటూరు నగరంలోని జేజేహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, గతంలోను గుంటూరులో కుక్కల దాడులు అనేకం చోటు చేసుకున్నాయి. గతంలో ఒక పాపపై దాడి చేసి ఆమె మృతికి కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications