గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షం-వరదల ఎఫెక్ట్: చంద్రబాబుకు చేదు అనుభవం, పొంగుతున్న వాగు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాటికి తోడు పై రాష్ట్రాల నుంచి వరద వచ్చి ప్రాజెక్టులు నిండుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలువురు వరదల్లో చిక్కుకుంటున్నారు. వారిని అధికారులు కాపాడుతున్నారు.

వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు.. శనివారం నాడు సీఎం చంద్రబాబును నిలదీశారు. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలోని రెడ్డిగూడెంలో చంద్రబాబుకు వరద వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఆయన వరదలను పరిశీలించేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు రెడ్డిగూడెంను పట్టించుకోవడం లేదని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబు వరద ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. పిడుగురాళ్ల, మాచర్ల, నరసారావుపేట, చిలుకలూరిపేట, సత్తెనపల్లి, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.

ఆ తర్వాత చంద్రబాబు హెలికాప్టర్ గుంటూరులో ల్యాండ్ కావాల్సి ఉంది. వరద ప్రభావిత ప్రాంతమైన క్రోసూరు వెళ్లాల్సి ఉంది. కానీ రెడ్డిగూడెం వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసి.. పైలట్‌ను అక్కడకు తీసుకు వెళ్లమని చెప్పారు.

అతను కలెక్టర్ కాంతిలాల్ దండె తదితరులతో కలిసి రెడ్డిగూడెం రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. రైల్వే ట్రాక్ ఎప్పటి వరకు సిద్ధమవుతుందో రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు మోడర్న్ టెక్నాలజీని వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయం అందిస్తామన్నారు. హైదరాబాద్ - గుంటూరు మధ్య తిరిగి సర్వీసులు తొందరగా నడపాలన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు రెడ్డిగూడెం వెళ్లారు. అక్కడ స్థానిక సిపిఎం నేత చలమయ్య తదితరులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డగించారు.

తమ గ్రామం నీటిలో మునిగిపోతే ఒక్కరు పట్టించుకోలేదని, అధికారులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే పిడుగురాళ్ల సీఐ హనుమంత రావు నేతృత్వంలో పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి వారిని అడ్డు తప్పించారు. అనంతరం సీఎం వెళ్లారు.

అక్కడ చంద్రబాబు బ్రిడ్జిని పరిశీలించారు. కూలిపోయిన ఇళ్లను, పొలాలను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు దూళిపాళ్ల వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఆ తర్వాత డ్యామేజ్ అయిన క్రోసూరు - అందలురు రోడ్డును తదితరాలను పరిశీలించారు.

చంద్రబాబుకు చేదు అనుభవం

చంద్రబాబుకు చేదు అనుభవం

వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు.. శనివారం నాడు సీఎం చంద్రబాబును నిలదీశారు. తద్వారా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలోని రెడ్డిగూడెంలో చంద్రబాబుకు వరద వల్ల చేదు అనుభవం ఎదురైంది.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఇక్కడి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబానికి 20కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో వంటనూనె, కిలో కందిపప్పు ఆదివారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రంలోగా రైతులకు పరిహారం అందించాలని చెప్పారు. దెబ్బతిన్న పంటలకు బీమాతోపాటు ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను సూచించారు.

జిల్లాకు 12 మంది ఐఏఎస్‌ అధికారులు

జిల్లాకు 12 మంది ఐఏఎస్‌ అధికారులు

49 మంది డిప్యూటీ కలెక్టర్లను పంపి వరద ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. హుధుద్ తుపానులో అందించిన సేవలనే ఇక్కడ కూడా అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న రహదారులు, రైల్వేమార్గాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు.

సత్తెనపల్లి సమీపంలో

సత్తెనపల్లి సమీపంలో

ధూళిపాళ్ల-భృగుబండ నడుమ కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో అవసరమైన సహకారాన్ని అందించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కరవు, వరద ప్రభావానికి గురైన ప్రాంతాలకు కేంద్రసాయాన్ని కోరుతూ సోమవారంలోగా నివేదిక పంపుతున్నామని వెల్లడించారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో

భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, పంటపొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం పరిశీలించారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను గగనతల పరిశీలన చేశారు. అనంతరం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం నుంచి రోడ్డు మార్గాన రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, అమరావతి మండలాల్లో వరద ప్రాంతాలను పరిశీలించారు.

ధూళిపాళ్ల వద్ద 1.5 కిలోమీటర్ల

ధూళిపాళ్ల వద్ద 1.5 కిలోమీటర్ల

మేర కొట్టుకుపోయిన రైల్వేట్రాక్‌ను పరిశీలించి పనుల పురోగతిపై రైల్వే ఇంజినీర్లతో చర్చించారు. కంకర లభ్యత లేకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని రైల్వేయంత్రాంగం చెప్పడంతో వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమీపంలో ఉన్న క్వారీ నుంచి కంకర ఇచ్చే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వీలైనంత తొందరగా పనులు పూర్తిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించారు.

క్రోసూరు మండలంలో

క్రోసూరు మండలంలో

పీసపాడు, బయ్యవరం, అందుకూరు గ్రామాల్లో వరద ఉద్ధృతికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వరదల వల్ల నిర్వాసితులైన వారికి నిత్యావసరాలు అందించామని, ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే అందిస్తామన్నారు.

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు

దెబ్బతిన్న రహదారులు, పంటపొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం పరిశీలించారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేశారు.

English summary
CM Chandrababu Naidu faced the ire of the flood victims at Reddigudem in Guntur district on Saturday. They obstructed him when he went there to inspect the flood-affected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X