తెలంగాణ శాసన సభలో గందరగోళం: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర శాసన సభ నుండి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం ఉదయం సస్పెండ్ అయ్యారు. ఉదయం సభ ప్రారంభం కాగానే.. గందరగోళం చెలరేగింది. రెండు రోజుల క్రితం గవర్నర్ ప్రసంగం సమయంలో జాతీయ గీతం అవమానించిన వారు క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వారు క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
విపక్ష సభ్యులు కూడా ధీటుగా స్పందించారు. తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని, వారి పైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చారు. సభలో గందరగోళం చెలరేగటంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
సస్పెండైన వారిలో ఎర్రబెల్లి దయాకర రావు, గాంధీ, గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, వివేక్, సాయన్న, రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులను సస్పెండ్ చేశారు.
అంతకుముందు వీడియో ఫుటేజీ పరిశీలన
\తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని సోమవారం ఫ్లోర్ లీడర్లు పరిశీలించారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ ఛాంబరులో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో సభలో జరిగిన ఘటన పైన చర్చించారు. అలాగే వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
కాగా, అంతకుముందు గన్‌పార్కు వద్ద తెలంగాణ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అసెంబ్లీలో తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు, మోత్కుపల్లి నర్సింహులు ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరసన దీక్ష చేపట్టనున్నారు. దీనికి పూర్తి మద్దతు ఉంటుందని నేతలు ప్రకటించారు.
కడియంలా మేం గోతికాడ నక్కలం కాదు: రేవంత్ రెడ్డి

మంత్రి కడియం శ్రీహరిలా తాము గోతికాడ నక్కలం కాదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అన్నారు. సహచర సభ్యులను కోతులని సంభోదించిన కడియం ఎలాంటివారో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు.
ఆయన కులంపై నిజనిర్థారణకు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీస్తామన్నారు. కేబినెట్‌లో మాల, మాదిగలు, స్ర్తీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ రిజర్వేషన్లను తాము కొట్టివేయలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications