జగన్! బతికుండగా కలవనని చెప్పగలవా?: పయ్యావుల

ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, జగన్-సోనియా గాంధీ బంధంపై స్కూలు పిల్లలను అడిగినా చెబుతారన్నారు. సోనియా దత్తపుత్రుడు జగన్ అన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఒక బెయిల్-రెండు రాష్ట్రాలు ఒప్పందంపై జగన్ సంతకం చేశారని విమర్శించారు. జగన్ అభయంతోనే ఒకప్పుడు అవినీతికి తెగించిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర విభజనకూ తెగించిందన్నారు.
తన బెయిల్ కోసం రాష్ట్రాన్ని విభజించే స్థాయికి జగన్ దిగజారాడని, దీనిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్, టిడిపికుమ్మక్కయ్యాయంటూ తన మీడియాలో పదేపదే ప్రచారం చేస్తూ తమపై బురదచల్లే యత్నం చేస్తున్నాడని ఆగ్రహించారు. టిడిపిఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు మాత్రం ఎక్కడా కనబడలేదన్నారు. ఢిల్లీ వెళ్లే ధైర్యం, సోనియాను ఎదిరించే సత్తా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వట్లేదని ప్రమాణం చేయగలవా అని జగన్‌కు సవాల్ విసిరారు. జగన్ సభను అడ్డుకోవద్దంటూ తెరాస అధ్యక్షుడు కెసిఆర్, కోదండరాం మాట్లాడటం ఏమిటన్నారు. బొగ్గు మసి అంటిన ప్రధాని పైన అవిశ్వాసం పెడితే జగన్ తన పార్టీ ఎంపీలతో ఓటేయిస్తారా చెప్పాలన్నారు.
లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ లక్ష మాటలు చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలు ఆయన గురించి ఒకే మాట వినాలను అనుకుంటున్నారని, బతికుండగా విభజనకు కారణమైన కాంగ్రెసుతో కలవవనని చెప్పగలవా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్‌లు అవినీతిలోనే కాకుండా.. విభజనలను అవిభక్త కవలలే అన్నారు.












Click it and Unblock the Notifications